HomeTelugu TrendingNC22లో కీలక పాత్రలో ప్రియమణి

NC22లో కీలక పాత్రలో ప్రియమణి

Priyamani in NC22
అక్కినేని నాగచైతన్య హీరోగా వెంకట్ ప్రభు డైరెక్షన్‌లో ఒక సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. దర్శకుడిగా వెంకట్ ప్రభుకి ఇది 11వ సినిమా కాగా, కెరియర్ పరంగా ఇది చైతూకి 22వ సినిమా. ఇటీవలే ఈ సినిమా రెగ్యులర్ షూటింగు ప్రారంభమైంది. తెలుగు .. తమిళ భాషల్లో ఈ సినిమాను శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నాడు. ఈ సినిమాలో ముఖ్యమైన పాత్రల కోసం ఎంపికైన స్టార్స్ ఒక్కొక్కరుగా రంగంలోకి దిగుతున్నారు.

ఈ సినిమాలో ప్రియమణి, సంపత్ రాజ్ ను కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ.. అందుకు సంబంధించిన పోస్టర్స్ ను రిలీజ్‌ చేశారు. ఈ సినిమా షూటింగులో వారు జాయిన్ అవుతున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది.

20221014fr6348fabc7f0a5

Recent Articles English

Gallery

Recent Articles Telugu