
Nani remuneration:
సినిమా ఇండస్ట్రీ అనేది ఎప్పుడూ మారుతూ ఉంటుంది. ఒక్కసారి హిట్ కొడితే హీరో రేంజ్ పెరుగుతుంది, అలాగే ఫ్లాప్ అయితే తగ్గిపోతుంది. అయితే మిడిల్ రేంజ్ హీరోల్లో నాని (Nani) మాత్రం తన స్థాయిని నిరూపించుకుంటూ ముందుకు సాగుతున్నాడు. దసరా (Dasara) సినిమా తర్వాత నాని మార్కెట్ మొత్తం మారిపోయింది.
నేచురల్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న నాని, తన మొదటి రోజుల్లో చిన్న సినిమాలు చేస్తూ గుర్తింపు తెచ్చుకున్నాడు. కానీ ‘దసరా’ సినిమాతో పాన్ ఇండియా లెవెల్ లో హిట్ కొట్టి, రూ. 100 కోట్ల క్లబ్ లో చేరిపోయాడు. ఈ విజయం తర్వాత నాని తన రెమ్యూనరేషన్ భారీగా పెంచేశాడు.
ఇప్పుడు నాని ఒక్క సినిమాకు రూ. 25 కోట్లకు పైగా తీసుకుంటున్నాడట. అయితే అతని తదుపరి సినిమా సుజిత్ (Sujeeth) డైరెక్షన్ లో ఉంటుందని సమాచారం. దీనికి నిర్మాత DVV దానయ్య (DVV Danayya) ముందుగా రూ. 50 కోట్ల ప్యాకేజీ ఇచ్చేశారని టాలీవుడ్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.
నాని మరోసారి ‘సరిపోదా శనివారం (Saripoda Sanivaram)’ తో భారీ హిట్ కొట్టాడు. ఇప్పుడు, శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela) డైరెక్షన్ లో ‘ప్యారడైజ్ (Paradise)’ అనే సినిమా ప్లాన్ చేస్తున్నాడు. దీనికి కూడా నాని రూ. 25 కోట్లకు పైగా పారితోషికం తీసుకోబోతున్నాడని టాక్.
ఇలా చూస్తే, నాని ఇప్పుడు మిడిల్ రేంజ్ హీరోలలో తనదైన మార్కెట్ కలిగి ఉన్నాడు. ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో అగ్రహీరోల రేంజ్ లోకి చేరుతున్నాడు.
ALSO READ: Nandamuri Mokshagna సరసన ఆ హీరోయిన్ ఉంటే సూపర్ అంటున్న ఫ్యాన్స్