HomeTelugu Trendingప్రియాంక ఇన్‌స్టాగ్రామ్‌ పోస్టుకు కాసుల వర్షం

ప్రియాంక ఇన్‌స్టాగ్రామ్‌ పోస్టుకు కాసుల వర్షం

1 7

బాలీవుడ్‌ బ్యూటీ చోప్రా ప్రపంచ వ్యాప్తంగా ఎంత పాపులరో తెలిసిందే. అమెరికన్ పాప్ సింగర్ నిక్ జోనాస్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈమె ప్రస్తుతం అమెరికాలోని లాస్ ఎంజెల్స్‌లో ఉటుంది. ఈ అమ్మడు పాపులారిటీ పెళ్లి తర్వాత మరింత పెరిగింది. కాగా సెలబ్రిటీలకు సోషల్‌మీడియా ప్లాట్‌ఫామ్స్‌ భారీ ధనార్జనకు రాజమార్గాలుగా మారాయి. ఈ స్టార్స్ సోషల్ మీడియాలో అప్పుడప్పుడూ కొన్ని పేయిడ్ పోస్ట్‌లు చేస్తుంటారు. ప్రియాంకచోప్రా ఇన్‌స్టాగ్రామ్‌లో చేసే ఒక్కపోస్ట్‌కు రెండుకోట్లకు పైగా చార్జ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రియాంకకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఐదున్నర కోట్లకుపైగా ఫాలోవర్స్‌ ఉన్నారు.

దాంతో పాపులర్ బ్రాండెడ్స్ తమ ఉత్పత్తులను సోషల్ మీడియాలో షేర్ చేయాలనీ ఒప్పందం కుదర్చుకుంటాయి. అందులో భాగంగా ప్రియాంక అప్పుడపుడు కొన్ని ఉత్పత్తుల్నీ తన సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటుంది. అలా ఒక్క ప్రమోషనల్‌ పోస్ట్‌కు 2కోట్లు సంపాదిస్తూ భారత సినీతారల్లో మొదటిస్థానంలో నిలుస్తోంది ప్రియాంక. అంతేకాదు ప్రియాంక ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా అధిక ఆదాయాన్ని ఆర్జిస్తున్న ప్రపంచ సెలబ్రిటీల్లో 28వ స్థానంలో ఉంది. ఈ సంపాదనలో ఒకప్పటి రెజ్లింగ్ స్టార్ ఇప్పటి హాలీవుడ్‌ నటుడు డ్వేన్‌ జాన్సన్‌ ఒక్కపోస్ట్‌కు రూ.7.6 కోట్లతో టాప్ 1 స్థానంలో నిలిచాడు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu