HomeTelugu Big Storiesఇండస్ట్రీలో నెపోటిజం ఉంది.. ప్రియాంక చోప్రా సంచలన వ్యాఖ్యలు..

ఇండస్ట్రీలో నెపోటిజం ఉంది.. ప్రియాంక చోప్రా సంచలన వ్యాఖ్యలు..

7 26

బాలీవుడ్‌ యంగ్‌ హీరో శాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య తరువాత నెపోటిజంపై ఎక్కువ చర్చ జరుగుతోంది. సినిమా బ్యాక్ గ్రౌండ్ ఉంటేనే ఇండస్ట్రీలో నిలదొక్కుకోగలరని… ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేని వారిని అణగదొక్కేస్తారనే విమర్శలు ఎక్కువవుతున్నాయి. ఇప్పటికే ఎందరో బాలీవుడ్ ప్రముఖులు ఈ నెపోటిజంపై గళమెత్తారు. దీనిపై హీరోయిన్ ప్రియాంక చోప్రా ఇండస్ట్రీలో నెపోటిజం ఉందంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇప్పడు ఈ వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి.

తాను కూడా ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండానే ఇండస్ట్రీలోకి వచ్చానని… ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నానని ప్రియాంక చెప్పింది. తాను ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో… రికమెండేషన్ తో వచ్చిన ఒక హీరోయిన్ కోసం, తనను ఓ సినిమా నుంచి తప్పించారని తెలిపింది. గొప్ప వారసత్వం ఉన్న ఇళ్లలో పుట్టడం తప్పని తాను చెప్పడం లేదని… అయితే, కఠినమైన సమయాలు ఎదురైనప్పుడు వాటిని ఎలా ఎదుర్కోవాలో తాను నేర్చుకున్నానని చెప్పింది.

తమ గమ్యం గురించి తప్ప, ఇతర ఏ అంశాల గురించి ఆలోచించకూడదని నిర్ణయించుకున్నానని.. ఓటమి అనే భయాన్ని దగ్గరకు రానివ్వరాదని ప్రతిక్షణం తనను తాను మార్గనిర్దేశం చేసుకునేదాన్నని ప్రియాంక తెలిపింది. ఎంతో ఆత్మవిశ్వాసంతో, పట్టుదలతో ఇండస్ట్రీలో సక్సెస్ ను సాధించానని చెప్పింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu