ఫ్యాన్స్‌పై కేక్ విసిరిన ప్రియాంక.. వీడియో వైరల్‌

బాలీవుడ్‌ బ్యూటీ ప్రియాంకా చోప్రా, ఆమె భర్త నిక్‌ జొనాస్‌ మియామీలో ఏర్పాటు చేసిన ప్రముఖ గాయకుడు స్టీవ్‌ అకో మ్యూజిక్‌ కన్సర్ట్‌లో సందడి చేశారు. కార్యక్రమం చూడటానికి వచ్చిన ప్రేక్షకులపై కిలోల కేక్‌లు విసిరారు. ఫ్యాన్స్‌ కూడా దాన్ని ఎంజాయ్‌ చేస్తూ తెగ కేకలు పెట్టారు. ఈ క్రేజీ వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీన్ని స్టీవ్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు. ‘మీకు కేక్‌ కావాలంటే చేతులు పైకి ఎత్తండి’ అని పేర్కొన్నారు. వీడియోలో ప్రియాంక, నిక్‌, జో జొనాస్‌ సందడిగా కేక్‌లు ఆడియన్స్‌ పై విసురుతూ కనిపించారు.

ప్రియాంక నటించిన హాలీవుడ్‌ సినిమా ‘ఈజ్‌ నాట్‌ ఇట్‌ రొమాంటిక్‌?’ సినిమా ఇటీవల విడుదలైంది. ప్రస్తుతం ఆమె ‘ది స్కై ఈజ్‌ పింక్‌’ సినిమాలో నటిస్తున్నారు. సోనాలీ బోస్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఫర్హాన్‌ అక్తర్‌, జైరా వాసిమ్‌ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. అక్టోబరులో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.