HomeTelugu Trendingఅఖిల్‌తో పూజా హెగ్డే .. కన్ఫర్మ్ చేసిన బృందం

అఖిల్‌తో పూజా హెగ్డే .. కన్ఫర్మ్ చేసిన బృందం

8 10అక్కినేని అఖిల్‌తో హాట్‌ బ్యూటీ రొమాన్స్‌కు సిద్ధమైంది… బొమ్మరిల్లు మూవీతో తన ప్రత్యేకతను చాటుకున్న బొమ్మరిల్లు భాస్కర్ ద‌ర్శక‌త్వంలో అఖిల్ నాల్గో సినిమా తెరకెక్కినుంది. అయితే, ఇప్పటికే ఈ చిత్రంలో పూజా హెగ్డే నటిస్తారనే ప్రచారం సాగింది.. మరోవైపు ఆమె ఆఫర్‌ను తిరస్కరించినట్టు కూడా పుకార్లు షికార్లు చేశాయి. ఇక, వాటన్నింటికి పుల్‌స్టాప్ పెడుతూ.. మేకర్స్ పూజా హెగ్డే పేరును కన్ఫర్మ్ చేశారు. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో ప్రకటించారు.

ఇక, అఖిల్ నాల్గో సినిమాని గీతా ఆర్ట్స్ బేన‌ర్‌పై బ‌న్నీ వాసు నిర్మిస్తున్నారు. అల్లు అర‌వింద్ స‌మ‌ర్పకుడిగా వ్యవ‌హ‌రిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ కూడా మొదలు పెట్టేశారు.. మ్యూజిక్‌ను గోపి సుంద‌ర్ సమకూరుస్తున్నారు. కాగా, వరుస సినిమాలతో దూసుకుపోతోంది పూజా హెగ్డే. సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబుతో కలిసి నటించిన మహర్షి సినిమాతో హిట్ అందుకున్న ఈ అమ్మడు.. ఆ తర్వాత వాల్మీకి, అల‌.. వైకుంఠ‌పుర‌ములో, హౌస్‌ఫుల్ 4, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్-రాధాకృష్ణ సినిమాల్లో ప్రస్తుతం బిజీగా ఉన్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu