HomeTelugu Trendingమెగాస్టార్‌ దర్శకుడికి ఆర్ధిక ఇబ్బందులు

మెగాస్టార్‌ దర్శకుడికి ఆర్ధిక ఇబ్బందులు

13 7టాలీవుడ్‌ మెగాస్టార్ చిరంజీవి మొదటి సినిమా ఏది అనగానే అందరికి గుర్తొచ్చే పేరు పునాదిరాళ్లు. ఈ సినిమా అప్పట్లో మంచి విజయం సాధించింది. ఈ సినిమాకు రాజ్ కుమార్ దర్శకత్వం వహించారు. మెగాస్టార్ సినీ కెరీర్ కు పునాది వేసిన పునాది రాళ్ళు సినిమా దర్శకుడు ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు. ఎలా ఉన్నాడు అనే విషయం ఎవరికైనా తెలుసా…

చిరంజీవి కెరీర్ కు బాటలు వేసిన దర్శకుడు రాజ్ కుమార్ జీవితం ప్రస్తుతం దయనీయంగా ఉన్నది. అనారోగ్యంతో మంచాన పడ్డారు. ఆర్ధికంగా ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న సినిమా మీడియం స్కూల్ సిబ్బంది స్పందించి తార్నాకలో ఉంటున్న రాజ్ కుమార్ ను కలిసి రూ. 41వేల రూపాయల ఆర్ధిక సహాయం అందించారు. అదే విధంగా మనం సైతం తరపున నటుడు కాదంబరి కిరణ్ రూ. 25 వేల రూపాయల సహాయం అందించారు. మెగాస్టార్ ను హీరోగా గుర్తించి ఇండస్ట్రీకి పరిచయం చేసిన రాజ్ కుమార్ కు మెగాస్టార్ కూడా స్పందిస్తారేమో చూడాలి.

13a

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!