నడవలేని స్థితిలో పంచ్‌ ప్రసాద్‌.. వీడియో వైరల్‌


జబర్దస్త్ హాస్యనటుడు పంచ్‌ ప్రసాద్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనసరం లేదు. తెర వెనుక ఆరోగ్య సమస్యలతో ఇబ్బందిపడుతున్నా.. అందరినీ నవ్విస్తూ.. తన బాధను మరిచిపోయేందుకు ప్రయత్నిస్తున్నాడు. పంచ్‌ ప్రసాద్‌ కిడ్నీ సంబంధ సమస్యతో బాధపడుతున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పటికే మానసికంగా, శారీరకంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పంచ్‌ ప్రసాద్‌కు తాజాగా మరో సమస్య ఎదురైంది. పంచ్‌ ప్రసాద్‌ పరిస్థితి ప్రస్తుతం ఇంకా ఇబ్బందికరంగా మారిందని, ఇపుడు నడవడానికి కూడా ఇబ్బంది పడుతున్నాడని జబర్దస్త్‌ నటుడు నూకరాజు తెలియజేశాడు.

పంచ్‌ ప్రసాద్‌ పరిస్థితికి సంబంధించిన విషయాన్ని యూట్యూబ్‌ ఛానల్‌లో షేర్‌ చేశాడు నూకరాజు. పంచ్‌ ప్రసాద్‌.. కనీసం నడవలేకపోతున్నట్టు వీడియోతో ద్వారా తెలుస్తుంది. ప్రసాదన్నకు ఇష్టం లేకపోయినా ఈ వీడియో యూట్యూబ్‌లో పోస్ట్‌ చేస్తున్నానని, అందరి ఆశీస్సులుండాలని, ఆయనకు సపోర్ట్‌ ఇవ్వాలని కోరాడు నూకరాజు. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. పంచ్‌ ప్రసాద్‌ త్వరగా కొలుకోవాలిని కామెంట్లు చేస్తున్నారు.

CLICK HERE!! For the aha Latest Updates