HomeTelugu Trendingకన్నడ స్టార్ హీరోతో పూరీ జగన్నాథ్ !

కన్నడ స్టార్ హీరోతో పూరీ జగన్నాథ్ !

Puri jagannadh next movie w
టాలీవుడ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ప్రస్తుతం విజయ్ దేవరకొండ హీరోగా ‘లైగర్’ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న ఈ సినిమాలో విజయ్ దేవరకొండ బాక్సర్ గా కనిపించనున్నాడు. ఫస్ట్ విజయ్ తో పాన్ ఇండియా మూవీ రూపొందిస్తున్నాడు పూరీ. ఇప్పుడు మళ్లీ సెకండ్ వేవ్ కారణంగా షూటింగ్ నిలిచిపోయింది. నిజానికి డైరెక్టర్ పూరీ లైగర్ షూటింగ్ వీలైనంత త్వరగా పూర్తి చేయాలనే ఆలోచనలో ఉన్నాడు. కానీ మహమ్మారి కారణంగా షూటింగ్ నిలిపేసి ముంబై నుండి హైదరాబాద్ కు షిఫ్ట్ అయింది బృందం. స్పోర్ట్స్ డ్రామా కావడంతో పూరీ జగన్నాథ్ లైగర్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. అయితే హైదరాబాద్ లో షెడ్యూల్ ఎప్పుడు మొదలవుతుందో తెలియదు. కాబట్టి డైరెక్టర్ పూరీ టైం వృధా చేయకుండా లైగర్ పోస్ట్ ప్రొడక్షన్ పనులు ప్రారంభించినట్లు టాక్. ఈ సినిమాను పూరీతో పాటు కరణ్ జోహార్ నిర్మిస్తున్నాడు.

తాజాగా పూరీ జగన్నాథ్ తరువాత సినిమా గురించి సోషల్ మీడియాలో పలు వార్తలు వినిపిస్తున్నాయి. పూరీ జగన్నాథ్ తదుపరి సినిమా కూడా పాన్ ఇండియా మూవీనే అని. అలాగే ఆ సినిమా కన్నడ స్టార్ యష్ తో తెరకెక్కించనున్నట్లు ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. ఇదివరకే వీరి కాంబినేషన్ గురించి పుకార్లు వచ్చాయి. కానీ ఈసారి పూరీ చెప్పిన కథకు యష్ కూడా సానుకూలంగా స్పందించాడని.. అలాగే కాంబినేషన్ కూడా సెట్ అయినట్లు వినికిడి. మరి ఇప్పటివరకు యష్ కూడా కేజీఎఫ్-2 తర్వాత తదుపరి సినిమా ఏంటనేది ప్రకటించలేదు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu