ఆసుపత్రిలో చేరిన ప్రముఖ దర్శకుడు

ప్రముఖ దర్శకుడు కోడి రామకృష్ణ ఆసుపత్రిలో చేరారు. ఉన్నట్టుండి ఆయన తీవ్ర అస్వస్థతకు గురికావడంతో కుటుంబ సభ్యులు ఆయన్ను గచ్చిబౌలిలోని ఏఐజి ఆసుపత్రిలో జాయిన్ చేశారు. ప్రస్తుతం వైద్యులు ఆయనకు వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నారు. ఆయన ఆరోగ్యం ఆందోళనకరంగానే ఉన్నట్టు తెలుస్తోంది. సినీ ప్రముఖులు, శ్రేయోభిలాషులు ఆయన ఆరోగ్యం త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నారు. కోడి రామకృష్ణ ‘అమ్మోరు, అరుంథతి, మువ్వ గోపాలుడు, దేవుళ్ళు, దేవి, పెళ్లి, శత్రువు, అనుకుశం’ లాంటి ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను అందించారు.