పూరీ కూడా మొదలెట్టాడు!

నిన్నటివరకు సినిమాలో సింగర్స్ మాత్రమే పాటలు పాడేవారు. రీసెంట్ గా సినిమాలో హీరోలు కూడా పాడడం మొదలుపెట్టారు. ఎన్టీఆర్, ధనుష్, శింబు, పవన్ కల్యాణ్ ఇలా చాలా మంది హీరోలు తమ సినిమాల్లో పాటలు పడుతున్నారు. ఇప్పుడు డైరెక్టర్ పూరీ జగన్నాథ్ వంతు వచ్చింది. డైరెక్టర్ గా, నిర్మాతగా తన టాలెంట్ ను నిరూపించుకున్న పూరీ ‘ఇజం’ సినిమాతో గేయ రచయితగా, సింగర్ గా కూడా తన అధృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు. కల్యాణ్ రామ్ హీరోగా నటిస్తోన్న ఈ సినిమాలో పూరీ రెండు పాటలను పాడినట్లుగా తెలుస్తోంది. అంతేకాదు ‘ఇజం’ టైటిల్ పాటను కూడా ఆయనే రాశారు. అనూప్ రుబెన్స్ సంగీతం అందిస్తోన్న ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం ఈ నెలలోనే నిర్వహించి నవంబర్ లో సినిమాను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
CLICK HERE!! For the aha Latest Updates