HomeTelugu Trending'పుష్ప-2' రిలీజ్‌ డేట్‌ వచ్చేసింది

‘పుష్ప-2’ రిలీజ్‌ డేట్‌ వచ్చేసింది

Pushpa 2 release date an

టాలీవుడ్‌లో వచ్చిన పాన్ ఇండియా చిత్రం పుష్ప. ఈ సినిమా మొత్తం దేశవ్యాప్తంగా మంచి క్రేజ్‌ని సంపాధించుకుంది. తాజాగా ఈ సినిమా సీక్వెల్స్‌ పుష్ప.. ది రూల్‌ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో అల్లు అర్జున్‌ హీరోగా నటిస్తున్నాడు. ఈ సీక్వెల్స్‌కి కూడా సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా నుండి బిగ్గెస్ట్‌ అనౌన్స్‌మెంట్‌ వచ్చింది.

పుష్ప ది రూల్ రిలీజ్‌ డేట్‌ని ప్రకటించింది చిత్రబృందం. పుష్ప -2 2024 ఆగస్టు 15న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. బాక్సాఫీసు ఏలడానికి పుష్పరాజ్ మరోసారి వస్తున్నాడంటూ మైత్రీ మూవీ మేకర్స్ తన పోస్టులో పేర్కొంది. రక్తం అంటిన పుష్పరాజ్ చేతిని కూడా పోస్టు చేసింది.

మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో కన్నడ భామ రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. ఫహద్‌ ఫాసిల్ జగదీష్‌ ప్రతాప్ బండారి, జగపతిబాబు, ప్రకాశ్‌ రాజ్‌, సునీల్‌, అనసూయ భరద్వాజ్‌, రావు రమేశ్‌, ధనంజయ, షణ్ముఖ్‌, అజయ్‌, శ్రీతేజ్‌ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

Image

Recent Articles English

Gallery

Recent Articles Telugu