స్టేజ్‌పై వెక్కి వెక్కి ఏడ్చేసిన అలియాభట్.. వీడియో వైరల్

ఆలియా సోదరి షహీన్‌ కొన్నేళ్ల క్రితం డిప్రెషన్‌తో బాధపడిందట. అనంతరం చికిత్స తర్వాత ఆమె కోలుకుందట. తాను డిప్రెషన్‌తో ఎలా పోరాడింది.. ఆ సమయంలో తన అనుభవాలేంటి అనే అంశాలను వివరిస్తూ.. ఆలియా సోదరి షహీన్‌ ‘ఐ హావ్‌ నెవర్‌ బీన్‌ హ్యాపీయర్‌’ అనే పుస్తకాన్ని రచించింది. ఈ పుస్తకాన్ని తాజాగా ఆలియాభట్ ముంబయిలో ఆవిష్కరించింది. ఈ సందర్భంగా ఆలియా తన సోదరి డిప్రెషన్‌తో ఎలా బాధపడిందో చెప్తూ తీవ్ర భావోద్వేగానికి గురై ఒక్కసారిగా స్టేజ్‌పైనే వెక్కివెక్కి ఏడ్చేసింది. ‘మా కుటుంబంలో షహీన్‌ చాలా తెలివైందని నేను నమ్ముతాను. కొన్నిసమయాల్లో షహీన్‌ తనను తను నమ్మదు. ఆ విషయం నన్ను బాగా బాధపెట్టేది. నేను చాలా సున్నితమైన మనస్కురాలిని. తను రాసిన ఈ పుస్తకం చదివాకే షహీన్‌ ఎదుర్కొన్న సమస్య ఏంటో నాకు పూర్తిగా అర్థమైంది. తనను నేను సరిగ్గా అర్థం చేసుకోలేదనిపిస్తుంది.’ అని చెప్పి ఆలియా ఒక్కసారిగా తీవ్ర భావోద్వేగానికి గురయింది. పక్కనే ఉన్న షహీన్‌.. ఆలియాను ఓదార్చే ప్రయత్నం చేసినప్పటికీ చాలాసేపటి వరకు ఆలియా అలాగే ఉండిపోయింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి.

CLICK HERE!! For the aha Latest Updates