HomeTelugu Big Stories'పుష్ప' ఫస్ట్‌ సాంగ్‌ సింగిల్‌ అప్‌డేట్‌ వచ్చేసింది

‘పుష్ప’ ఫస్ట్‌ సాంగ్‌ సింగిల్‌ అప్‌డేట్‌ వచ్చేసింది

Pushpa first song release d

ఐకాన్‌ స్టార్ అల్లు అర్జున్‌ హీరోగా నటిస్తున్న భారీ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘పుష్ప’. ఎర్రచందనం స్మగ్లింగ్‌ నేపథ్యంలో రూపుదిద్దుకుంటోన్న ఈ పాన్‌ ఇండియా చిత్రం సుకుమార్‌ డైరెక్షన్‌లో వస్తుంది. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు. కాగా, సోమవారం దేవిశ్రీ పుట్టినరోజు సందర్భంగా ‘పుష్ప’ ఆడియోపై చిత్రబృందం ఓ స్పెషల్‌ అప్‌డేట్‌ ఇచ్చింది. ఆగస్టు 13న ‘పుష్ప’ ఫస్ట్‌ సింగిల్‌ విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ‘దాక్కో దాక్కో మేక’ అంటూ సాగే ఈ పాటను దేవిశ్రీ సారథ్యంలో ఐదు భాషల్లో విశాల్‌ దడ్లానీ (హిందీ), విజయ్‌ ప్రకాశ్‌ (కన్నడ), రాహుల్‌ నంబియార్‌ (మలయాళం), శివమ్‌ (తెలుగు), బెన్నీ (తమిళం) అనే ఐదుగురు ప్రముఖ గాయకులు ఆలపించనున్నారు.

బన్నీ-సుకుమార్‌-దేవిశ్రీ కాంబిలో వస్తోన్న హ్యాట్రిక్‌ చిత్రమిది. రష్మిక హీరోయిన్‌గా నటిస్తుంది. మలయాళీ నటుడు ఫహద్ ఫాజిల్‌ విలన్‌గా కనిపించనున్నారు. రెండు భాగాలుగా విడుదల కానున్న ‘పుష్ప’ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్‌ నిర్మిస్తోంది. ‘పుష్ప’ మొదటి భాగం షూటింగ్‌ చివరి దశకు చేరుకుంది. నిర్మాణానంతర పనులు పూర్తి చేసుకుని త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న ‘పుష్ప’ ప్రమోషన్స్‌ కోసం చిత్రబృందం భారీగా ప్రణాళిక రూపొందించినట్లు తెలుస్తోంది. మరోవైపు ఈ సినిమాలోని ఓ ప్రత్యేక గీతంలో సన్నీలియోనీ ఆడిపాడే అవకాశాలున్నట్లు సమాచారం.

Recent Articles English

Gallery

Recent Articles Telugu