‘సాహో’ స్పెషాలిటీ అదే!

బాహుబలి గా నటించిన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్  జాతీయ స్థాయిలో నటుడిగా మంచి గుర్తింపు దక్కించుకున్నాడు.  అయితే ఇప్పుడు తన తదుపరి చిత్రాలకు కూడా అదే స్థాయిలో ఇమేజ్ కాపాడుకోవాలని చూస్తున్నాడు. సుజిత్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ‘సాహూ’ చిత్రంపై ప్రత్యేక శ్రద్ద పెట్టారు.  అంతే కాదు ఈ చిత్రం నేషనల్ వైడ్ రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేసుకుంటున్నారు ప్రభాస్. చిత్రంలో ప్రభాస్ రెండు డిఫరెంట్ షేడ్స్ లో నటించబోతున్నాడట.

ఆ రెండు పాత్రలు కూడా ఇంత వరకు ఎప్పుడూ చేయని విధంగా ఉండేట్టు డిజైన్ చేసారని వినికిడి.  ఇప్పటికే బాహుబలి లాంటి సినిమాలో రెండు పాత్రల్లో కనిపించిన ప్రభాస్ ఈ సారి ఏ మంత్రం వేస్తాడో చూడాలి!