HomeTelugu News'పుష్ప'లో హీరోయిన్‌ ఒక్కరే: మూవీ యూనిట్‌

‘పుష్ప’లో హీరోయిన్‌ ఒక్కరే: మూవీ యూనిట్‌

11 22
టాలీవుడ్‌ స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ ..డైరెక్టర్‌ సుకుమార్‌ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం ‘పుష్ప’. ఈ సినిమా హీరోయిన్‌ గురించి చిత్రబృందం క్లారిటీ ఇచ్చింది. లారీ డ్రైవర్‌గా బన్నీ రఫ్‌ లుక్‌లో కనిపించనున్నాడు. కాగా ఈ సినిమాలో రష్మిక హీరోయిన్‌గా నటించనున్నారని చిత్రబృందం ఎప్పుడో ప్రకటించింది. అయితే ఇటీవల ఈ సినిమాలో నివేదా థామస్‌ సెకండ్‌ హీరోయిన్‌గా కనిపించనున్నారని ప్రచారం జరుగుతోంది. బన్నీ ప్రియురాలిగా నివేదా కనిపించనున్నారని, ఆమె పాత్రకు సినిమాలో ఎంతో ప్రాధాన్యం ఉంటుందని సోషల్‌మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో ‘పుష్ప’ చిత్రబృందం ఆ వార్తలను ఖండించింది. ముందు ప్రకటించనట్లుగానే తమ చిత్రంలో రష్మిక ఒక్కరే హీరోయిన్‌ అని తేల్చి చెప్పింది. ‘పుష్ప’ చిత్రంలో నివేదా థామస్‌ ఉన్నారంటూ వస్తున్న వార్తల్లో ఎంత మాత్రం నిజం లేదని వెల్లడించింది. ఇటీవల ఆరంభమైన ఈ సినిమా షూటింగ్‌ను లాక్‌డౌన్‌ కారణంగా వాయిదా పడింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu