HomeTelugu Trending'పుష్ప' ట్రైలర్‌ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌

‘పుష్ప’ ట్రైలర్‌ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌

Pushpa trailer release date 1
ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘పుష్ప’. సుకుమార్ డైరెక్షన్‌లో వస్తున్నఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్నారు. ఈ సినిమాను డిసెంబర్ 17వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేయడానికి డేట్‌ని ఫిక్స్‌ చేశారు.

డిసెంబర్ 6వ తేదీన ట్రైలర్ ను విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. అందుకు సంబంధించిన అధికారిక పోస్టర్ ను వదిలారు. ఇంతవరకూ ఈ సినిమా నుంచి వదిలిన ప్రతి పాటకు అనూహ్యమైన స్పందన వచ్చింది. దేవిశ్రీ ప్రసాద్ కి మంచి మార్కులు పడ్డాయి. ఇక ట్రైలర్ తో మరింతగా అంచనాలు పెంచే కసరత్తు జరుగుతోంది.

రష్మిక హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ సినిమాలో, విలన్‌గా ఫాహద్ ఫాజిల్ కనిపించనున్నాడు. సునీల్ .. అనసూయ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. వచ్చేనెల 12వ తేదీన ప్రీ రిలీజ్ ఈవెంట్ ను జరపనున్నట్టు ఒక టాక్ వినిపిస్తోంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu