HomeTelugu Trendingవిజయ్‌ దేవరకొండపై బాలీవుడ్ హీరోయిన్స్ ఆసక్తి

విజయ్‌ దేవరకొండపై బాలీవుడ్ హీరోయిన్స్ ఆసక్తి

Vijay and sara alikhan roma

విజయ్ దేవరకొండ హీరోగా లైగర్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇందులో బాలీవుడ్ నటి అనన్యపాండే హీరోయిన్‌గా నటిస్తోంది. విజయ్ సరసన నటించేందుకు బాలీవుడ్ భామలు తెగ ఆసక్తి చూపుతున్నారట. త్వరలో బాలీవుడ్‌లోని మరో బ్యూటీ సారాఅలీఖాన్ కూడా విజయ్‌తో కలిసి రొమాన్స్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. లైగర్ సినిమా షూటింగ్ కోసం విజయ్‌దేవరకొండ ముంబైలోనే ఎక్కువగా ఉంటున్నాడు. ఇందులో భాగంగానే నటి సారా అలీఖాన్‌తో కలిసి విజయ్ కొన్ని ఫొటోలు దిగారు. అవి కాస్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ప్రముఖ నిర్మాత వీరిద్దరితో ఓ సినిమా తీయడానికి సిద్ధంగా ఉన్నాడట. విజయ్-సారా అలీఖాన్ కలిసి ఓ దక్షిణాది చిత్రంలోనటించబోతున్నారంటూ వార్తలు వస్తున్నాయి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu