Homeతెలుగు Newsపేదలకు కనీస ఆదాయ హామీ: రాహుల్

పేదలకు కనీస ఆదాయ హామీ: రాహుల్

14 5
రానున్న లోక్‌సభ ఎన్నికల్లో తాము గెలిస్తే “కనీస ఆదాయ హామీ”ని అమలు చేస్తామని కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ తెలిపారు. ఛత్తీస్‌గఢ్‌లో నిర్వహించిన రైతుల ర్యాలీలో పాల్గొన్న రాహుల్‌ గాంధీ ఎన్డీఏ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. “2019 లోక్‌సభ ఎన్నికల్లో మేము గెలిస్తే, పేదల ఆదాయం విషయంలో ఇంతవరకు ఏ పార్టీ తీసుకోని నిర్ణయాన్ని తీసుకుంటాం. దేశంలోని ప్రతి పేదవారికి కనీస ఆదాయ హామీ కల్పిస్తాం. ఇటువంటి నిర్ణయాన్ని ప్రపంచంలోనే ఏ ప్రభుత్వమూ తీసుకోలేదు. దేశంలోని ప్రతి పేదవాడు కనీస ఆదాయాన్ని కలిగి ఉంటాడు. దేశంలో పేదవారు, ఆకలి బాధలు ఉండవు. రైతు రుణమాఫీ చేయాలని కోరితే బీజేపీ ప్రభుత్వం తమ వద్ద డబ్బు లేదని అంటోంది. రైతులకు సాయం చేయడానికి డబ్బు లేదు కానీ, 15 మంది బడా పారిశ్రామిక వేత్తల రుణాలు మాఫీ చేయడానికి మాత్రం ఉంటాయి” అని రాహుల్ వ్యాఖ్యానించారు.

“ఛత్తీస్‌గఢ్‌ ప్రజలు మాపై నమ్మకం ఉంచారు. మా పార్టీ ఈ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేలా తీర్పునిచ్చారు. మాకు ఇప్పుడు చాలా బాధ్యతలు ఉన్నాయి. కాంగ్రెస్‌ నేతలు ఐకమత్యంతో కలిసి పనిచేశారు. రైతు రుణమాఫీ చేయడానికి డబ్బు లేదని బీజేపీ అంటోంది. ఇక్కడ 15 ఏళ్లుగా బీజేపీ ప్రభుత్వం చేయలేనిది మేము 24 గంటల్లో చేశాం. దేశంలో రాఫెల్ అనేది పెద్ద ఒప్పందం. దానివల్ల దేశంలో చాలా ఉద్యోగాలు వచ్చేవి. కానీ, ఈ ఒప్పందం ద్వారా మోడీ తన మిత్రులు మాత్రమే లబ్ధి పొందేలా చేశారు. భూసేకరణ బిల్లుని కూడా బీజేపీ నిర్వీర్యం చేసింది. గతంలో కాంగ్రెస్‌ హరిత విప్లవానికి కారణమైంది.. ఆహార భద్రతను ప్రవేశపెట్టింది” అని రాహుల్‌ గాంధీ అన్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu