HomeTelugu Trendingబిగ్‌బాస్‌ కంటెస్టెంట్స్‌తో రాహుల్‌ పార్టీ

బిగ్‌బాస్‌ కంటెస్టెంట్స్‌తో రాహుల్‌ పార్టీ

6 4

‘బిగ్‌బాస్‌’ తెలుగు సీజన్‌-3 విజేత, గాయకుడు రాహుల్‌ సిప్లిగంజ్‌ ఫుల్ జోష్‌లో ఉన్నారు. ప్రేక్షకుల నుంచి అత్యధిక ఓట్లు రావడంతో సీజన్‌-3 విజేతగా ఆయన పేరును ఆదివారం రాత్రి వ్యాఖ్యాత అక్కినేని నాగార్జున ప్రకటించిన సంగతి తెలిసిందే. మెగాస్టార్‌ చిరంజీవి చేతుల మీదుగా రాహుల్‌ రూ.50 లక్షల నగదు, ట్రోఫీ అందుకున్నారు. శ్రీముఖి రన్నరప్‌గా నిలిచారు. జులై 21న ప్రారంభమైన సీజన్‌-3 చివరి వరకు ఎంతో ఉత్కంఠగా కొనసాగింది. యాంకర్‌గా నాగ్‌ మరోసారి అదరగొట్టారు.

‘బిగ్‌బాస్‌’ టైటిల్‌ గెలుచుకున్న తర్వాత రాహుల్‌ తన సహ కంటెస్టెంట్స్‌, కుటుంబ సభ్యులతో కలిసి వేడుకలు చేసుకున్నారు. వరుణ్‌ సందేశ్‌, వితిక, పునర్నవి భూపాలం తదితరులతో కలిసి సరదాగా సమయం గడిపారు. ఈ సందర్భంగా తీసిన ఫొటోలు, వీడియోలను వీరు సోషల్‌మీడియాలో షేర్‌ చేశారు. అవి ప్రస్తుతం వైరల్‌గా మారాయి. ట్రోఫీ, నగదు గెలుచుకుని వచ్చిన రాహుల్‌కు కుటుంబ సభ్యులు, స్నేహితులు ఘనంగా స్వాగతం పలికారు. ఓ వీడియోలో రాహుల్‌ భుజాలపై వరుణ్‌ సేదతీరుతూ కనిపించారు.

యూట్యూబ్‌ ద్వారా రాహుల్‌ గాయకుడిగా కెరీర్‌ ఆరంభించారు. సంగీతం కంపోజ్‌ చేస్తూనే పాటలు పాడేవారు. 2009లో వచ్చిన ‘జోష్‌’తో గాయకుడిగా పరిచయం అయ్యారు. ఇదే సినిమాలో నాగచైతన్యతో కలిసి నటించారు. ఆపై ‘దమ్ము’, ‘ఈగ’, ‘లై’, ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’, ‘రంగస్థలం’, ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ తదితర చిత్రాల కోసం పాటలు పాడి, ఆకట్టుకున్నారు.

6a 1

Recent Articles English

Gallery

Recent Articles Telugu