HomeTelugu TrendingAndhra Pradesh లో 7 కొత్త విమానాశ్రయాలు: చంద్రబాబు నాయుడు కొత్త ప్లాన్ ఏంటంటే!

Andhra Pradesh లో 7 కొత్త విమానాశ్రయాలు: చంద్రబాబు నాయుడు కొత్త ప్లాన్ ఏంటంటే!

7 New Airports in Andhra Pradesh: Here's Everything You Need to Know!
7 New Airports in Andhra Pradesh: Here’s Everything You Need to Know!

New Airports in Andhra Pradesh:

ఆంధ్రప్రదేశ్‌లో రాబోయే రోజుల్లో ఆకాశ మార్గాలు మరింత విస్తరించబోతున్నాయి. ఇప్పటి వరకు ఏపీలో విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, రాజమండ్రి వంటి ముఖ్యమైన ఎయిర్‌పోర్టులు ఉన్నాయి. అయితే ప్రభుత్వం ఇప్పుడు మరింత కవరేజ్ కోసం ఏడు కొత్త ఎయిర్‌పోర్టులను నిర్మించేందుకు సిద్ధమైంది.

ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా కుప్పం, శ్రీకాకుళం, దగదర్తి, తాడేపల్లిగూడెం, నగర్జున సాగర్, తుని-అన్నవరం, ఓంగోలు వంటి ప్రాంతాల్లో ఎయిర్‌పోర్టులు నిర్మించనున్నారు. ఇవి ప్యాసింజర్ ట్రాఫిక్‌తో పాటు కార్గో సేవలకు కూడా ఉపకరించేలా ఉంటాయి.

ఎక్కడెక్కడ ఎయిర్‌పోర్టులు రాబోతున్నాయి?

కుప్పం: 1,250 ఎకరాల భూమి గుర్తించారు.

శ్రీకాకుళం: 1,383 ఎకరాల భూమి సర్వే పూర్తయింది.

దగదర్తి: కార్గో సేవలకు ప్రత్యేకంగా 635 ఎకరాల భూమి సిద్దమైంది.

తుని: రైల్వే, హైవే, వాటర్ బాడీల దగ్గర 757 ఎకరాల స్థలం రెడీ అయ్యింది.

ఓంగోలు: 657 ఎకరాల భూమిని గుర్తించారు.

ప్రభుత్వం కొత్త ఎయిర్‌పోర్టులు మాత్రమే కాదు, ఇప్పటికే ఉన్న గన్నవరం, రాజమండ్రి ఎయిర్‌పోర్టుల్ని కూడా విస్తరించే పనులు చేపట్టింది. గన్నవరం ఎయిర్‌పోర్టు కొత్త టర్మినల్ డిజైన్‌ను కూచిపూడి నృత్యం, అమరావతి స్థూపాలు ప్రేరణగా తీసుకుని నిర్మించనున్నారు.

ఈ కొత్త ఎయిర్‌పోర్టులు కేవలం ప్రయాణికులకే కాదు, రాష్ట్రానికి పరిశ్రమలు, వ్యాపారం, పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి కూడా ఎంతో ఉపయోగపడతాయి.

ALSO READ: SSMB29 విడుదల తేదీ గురించి గుట్టు రట్టు చేసిన రామ్ చరణ్!

Recent Articles English

Gallery

Recent Articles Telugu