బిగ్ బాస్ విన్నర్‌ ‘కౌశల్‌’కి వ్యతిరేకంగా ‘అందరూ గొర్రెలే’వీడియో సాంగ్.. వైరల్‌

తెలుగు బుల్లితెర పై బిగ్ బాస్ సీజన్ 2 కి నాని వ్యాఖ్యాతగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. ఈ సీజన్ మొదలైనప్పటి నుంచి ఎన్నో కాంట్రవర్సీలు మొదలయ్యాయి. ముఖ్యంగా బిగ్ బాస్ 2 లో ఇంటి సభ్యుడుగా వచ్చిన కౌశల్ కి బయట ఒక కౌశల్ ఆర్మీ ఏర్పడటం..వారు ఓటింగ్ చేసేదాన్ని బట్టి ఇంటి సభ్యులు ఎలిమినేట్ అవ్వడం జరిగిందని ప్రచారం కొనసాగింది. మొత్తానికి బిగ్ బాస్ సీజన్ 2 విన్నర్ కౌశల్ అయ్యాడు. అయితే ఈ మద్య కౌశల్ కి .. కౌశల్ ఆర్మీకి మధ్య మాటల యుద్ధం జరుగుతోన్న విషయం తెలిసిందే.

కౌశల్ ఆర్మీ తరఫున సేవా కార్యక్రమాలను అందించడం కోసం ఏర్పాటు చేసిన ఫౌండేషన్ ను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టుగా కౌశల్ చెప్పినట్టుగా కూడా వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో కొన్ని ఛానల్స్ లో కౌశల్ ఆర్మికి కౌశల్ కి మద్య తారాస్థాయిలో డిబెట్ లు జరిగాయి. తాజాగా కౌశల్ తీరును తప్పుబడుతూ ఒక పాటను కూడా రిలీజ్ చేశారు.

“అందరూ గొర్రెలే ..” అంటూ సాగే ఈ పాట ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చెన్నై కి చెందిన అరవింద్ అనే వ్యక్తి ఈ పాటను విడుదల చేశాడు. ఈ పాటలో కౌశల్ కి సపోర్ట్ చేసి మేమంతా గొర్రెలం అయ్యాం అంటూ సాగింది. ‘అన్న అనుకుంటే పీఎమ్ కాల్ వస్తది .. సీఎం సీటు వస్తది .. టెన్త్ పాస్ కాకున్నా డాక్టరేట్ వస్తది’ అనే వ్యంగ్యాస్త్రాలను సంధిస్తూ రాసిన ఈ పాటపై కౌశల్ ఎలా స్పందిస్తాడో చూడాలి.