HomeTelugu Trendingఇక మీరే.. ఎన్టీఆర్‌ రామ్‌చరణ్‌కు.. రాజమౌళి ఛాలెంజ్‌

ఇక మీరే.. ఎన్టీఆర్‌ రామ్‌చరణ్‌కు.. రాజమౌళి ఛాలెంజ్‌

6 19
లాక్‌డౌన్ ఎఫెక్ట్‌తో అందరు ఇంటికే పరిమితమయ్యారు. దీంతో సెలబ్రిటీలు ఒకరికి మరొకరు ఛాలెంజ్ లు విసురుకుంటున్నారు. తాజాగా అర్జున్ రెడ్డి డైరెక్టర్‌ సందీప్ రెడ్డి వంగ.. దర్శకధీరుడు రాజమౌళికి ‘బీ ద రియల్ మ్యాన్’ అనే ఛాలెంజ్ విసిరారు. ఈ ఛాలెంజ్ లో ఆడవాళ్లకు ఇంటిపనుల్లో సహాయం చేయాలి. ఛాలెంజ్ ను స్వీకరించిన రాజమౌళి చీపురు, చేట చేతబట్టి ఇంట్లోని దుమ్ము, ధూళి దులిపేసారు. అంతేకాదు.. తడిగుడ్డతో టైల్స్ ను తళతళలాడేలా తుడిచారు. అనంతరం వీడియో ను ట్విట్టర్ లో పోస్ట్ చేసారు. “నా టాస్క్ పూర్తయింది సందీప్ వంగా! ఇక, తారక్, రామ్ చరణ్ లను చాలెంజ్ చేస్తున్నాను. శోభు యార్లగడ్డ, సుకుమార్, పెద్దన్న కీరవాణిలకు కూడా ఈ ఛాలెంజ్ విసురుతున్నాను అంటూ పేర్కొన్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu