బిగ్‌బాస్‌-2 ఫైనల్లో సామ్రాట్.. గుడ్డు గేమ్‌లో వెనకబడ్డ రోల్

బిగ్ బాస్ సీజన్ 2 గ్రాండ్ ఫినాలే సందడి మొదలైంది. బిగ్ బాస్ హౌస్‌లో ఉన్న ఆరుగురిలో ఒకరు ఫైనల్‌కి చేరుకున్నారు. గురువారం 103వ ఎపిసోడ్‌ బిగ్ బాస్ ఫైనల్‌ రేస్-2లో భాగంగా ఫైనల్‌కు వెళ్లేందుకు సామ్రాట్, రోల్ రైడాల మధ్య “మీ గుడ్డు జాగ్రత్త” అనే ఛాలెంజింగ్ టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్. ఈ టాస్క్ ప్రకారం.. బౌల్‌లో ఉన్న గుడ్లను కాపాడుకుంటూ ఉంటాలి. హౌస్‌లో ఉన్న మిగిలిన సభ్యులు ఆ గుడ్లను పగలగొట్టాలి. ఫైనల్‌గా ఎవరి బౌల్‌లో ఎక్కువ గుడ్లు పగలకుండా ఉంటాయో వాళ్లే డైరెక్ట్‌గా ఫైనల్‌కు వెళ్తారంటూ బిగ్ బాస్ ఈ టాస్క్ ఇచ్చారు. గత రెండు రోజురోజులుగా హౌస్‌లో కౌశల్ ఒకవైపు మిగతా కంటెస్టెంట్స్ అంతా మరోవైపు అన్నట్టుగా సాగిన షో గురువారం కాస్త రూటు మారింది.

నిన్నటి ఎపిసోడ్‌లో కౌశల్.. తనను కుక్కతో పోల్చడంతో గుక్కపెట్టి ఏడ్చిన రోల్‌కి ఈ టాస్క్‌లో కౌశల్ అండగా నిలబడ్డాడు. గీతా మాధురి, దీప్తి, తనీష్‌ సామ్రాట్‌కి మూకుమ్మడిగా మద్దతు తెలపడంతో రోల్ రైడా ఒంటరివాడయ్యాడు. దీంతో రోల్ అభ్యర్ధన మేరకు తనకు అండగా నిలబడి చివరి వరకూ తనీష్, దీప్తి, గీతా మాధురితో తలపడ్డాడు కౌశల్.

చాలా సేపు వంటగదిలో కబోర్డ్‌లో దాక్కుని తన గుడ్లను కాపాడుకున్న రోల్ రైడాపై దాడి చేయకుండా బయట నుండి కౌశల్ కాపాడాడు. అయితే బయటకు వచ్చి గేమ్ ఆడాలని బిగ్ బాస్ ఆదేశించడంతో బయటకు వచ్చే ప్రయత్నంలో తనీష్, దీప్తి, గీతలు దాడి చేయడంతో గుడ్లు కిందపడి పగిలిపోయాయి. ఇక రోల్ రైడా గుడ్లు ఎలాగూ కింద పడిపోయాయి కాబట్టి.. సామ్రాట్ గుడ్లను పగలగొట్టేందుకు కౌశల్ ప్రయత్నించాడు. అయితే మిగిలిన సభ్యులతో పాటు చివర్లో రోల్ రైడా సామ్రాట్ వైపే మొగ్గు చూపారు.

తన గుడ్లు ఎలాగూ కింద పడిపోయాయి కాబట్టి సామ్రాట్ గుడ్లను పగలగొట్టలేమని.. అతన్నే విన్ కానియ్యమంటూ చేతులెత్తేశాడు రోల్ రైడా. అయితే ఇప్పటి వరకూ నీ తరపున చాలా రిస్క్ చేసి నిలబడితే నువ్.. ప్రయత్నించకుండా సామ్రాట్‌కి మద్దతు తెలపడం ఏంటి అంటూ కౌశల్ ప్రశ్నించాడు. మిగిలిన సభ్యుల సంగతి పక్కన పెట్టు నీకు సామ్రాట్ గెలవాలని ఉందా అని రోల్ ని అడగడంతో అవునని సమాధానం ఇవ్వడంతో గేమ్‌ని వదిలేశాడు కౌశల్. అనంతరం సామ్రాట్ గ్రాండ్ ఫినాలేకి చేరడంతో నాటకీయత చాలానే కనిపించింది. ఒకర్నొకరు కౌగిలించుకుని ఎమోషన్ అవ్వడం.. సామ్రాట్ కన్నీళ్లు పెట్టుకోవడం, తనీష్, గీతామాధురి, దీప్తిలు తనకోసం చేసిన త్యాగాన్ని తలచుకుని ఎమోషన్ అయ్యాడు సామ్రాట్.