HomeTelugu Newsప్రారంభమైన 'RRR'

ప్రారంభమైన ‘RRR’

5 10దర్శకధీరుడు ఎస్‌.ఎస్‌ రాజమౌళి తెరకెక్కించనున్న మల్టీస్టారర్‌ ‘RRR’ (వర్కింగ్‌ టైటిల్‌)చిత్రం ఈరోజు లాంఛనంగా ప్రారంభమైంది. పూజా కార్యక్రమం నిర్వహించి ఈ సినిమా చిత్రీకరణను ప్రారంభించినట్లు చిత్రవర్గాలు సోషల్‌మీడియా ద్వారా వెల్లడించాయి. ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ ఇందులో ఈ చిత్రంలో హీరోలుగా నటిస్తున్నారు. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్‌ పనులు పూర్తయ్యాయి. ఈ సినిమాకు ‘రామ రావణ రాజ్యం’, ‘తారక్‌రామ్‌’ అనే టైటిళ్లను పరిశీలిస్తున్నారట.

5b

దీనిపై చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన రాలేదు. సినిమాలోని మిగతా నటీనటుల వివరాలను త్వరలో వెల్లడించనున్నట్లు తెలుస్తోంది. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై డీవీవీ దానయ్య ‘RRR’ నిర్మిస్తున్నారు. కీరవాణి స్వరాలు సమకూరుస్తున్నారు. నవంబర్‌ 19న రెగ్యులర్‌ చిత్రీకరణ మొదలవుతుంది. తొలి సన్నివేశాన్ని తారక్‌, చరణ్‌పై యాక్షన్‌ ఎపిసోడ్‌ను చిత్రీకరించనున్నట్లు చిత్రవర్గాలు వెల్లడించాయి. త్వరలోనే మిగిలిన నటీనటులు, చిత్రబృందం వివరాలను వెల్లడించనున్నారు. ఈ చిత్రం కోసం అభిమానులే కాదు సినీ ప్రముఖులు కూడా ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

5a 1

Recent Articles English

Gallery

Recent Articles Telugu