వెంకటేష్‌తో వినాయక్ మూవీ?

డైరెక్టర్‌ వివి వినాయక్ ఈ మధ్య సరైన హిట్ లేనందువలన డీలా పడిపోయారు. ఆయన చివరి సినిమా ‘ఇంటెలిజెంట్’ సైతం బాక్సాఫిస్ వద్ద పరాజయం పొందింది. దీంతో ఇకపై ఈ సీనియర్ దర్శకుడికి సినిమాలు కష్టమనే అనుకున్నారంతా. కానీ వినాయక్ మాత్రం సీనియర్ హీరో వెంకటేష్‌తో సినిమా చేస్తున్నట్లు టాక్‌. తమిళ హిట్ మూవీ విక్రమ్ వేదాకు ఇది తెలుగు రీమేక్ అట. ఈ చిత్రంలో ఇంకొక హీరోగా నార్ రోహిత్ నటిస్తాడనే వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ వార్తల్లో ఎంత నిజముందో తెలియాలంటే అఫీషియల్ కన్ఫర్మేషన్ అందే వరకు వేచి చూడాల్సిందే.

CLICK HERE!! For the aha Latest Updates