మంచు విష్ణు ‘ఓటర్’కి డేట్ ఫిక్స్ అయింది!

మంచు విష్ణు-సురభి జంటగా జి.ఎస్.కార్తీక్ దర్శకత్వంలో రూపొందుతున్న తెలుగు-తమిళ బైలింగువల్ ‘ఓటర్’. ‘హీరో ఆఫ్ ది నేషన్’ అనేది ట్యాగ్ లైన్. రామా రీల్స్ పతాకంపై సుధీర్ కుమార్ పూదోట నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ఆగస్ట్ 11న ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు దర్శకనిర్మాతలు సన్నద్ధమవుతున్నారు.
ఈ సందర్భంగా చిత్ర నిర్మాత సుధీర్ కుమార్ పూదోట మాట్లాడుతూ.. ”తెలుగు-తమిళ భాషల్లో ఏకకాలంలో రూపొందుతున్న ఈ సినిమా చిత్రీకరణ చివరి దశకు చేరుకొంది. ఆగస్ట్ 11న చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం. ఈ చిత్రం మంచు విష్ణు కెరీర్ లో మైలురాయిగా నిలవడంతోపాటు మా చిత్ర బృందానికి మంచి పేరు తీసుకువస్తుంది. త్వరలోనే టైటిల్ లోగోను విడుదల చేసి.. ఆడియో విడుదల తేదీని ప్రకటిస్తాం” అన్నారు.