కన్నడ ప్రజలకు జక్కన్న స్పీచ్!

కావేరీ జల వివాదంపై సత్యరాజ్ చేసిన కామెంట్స్ ను దృష్టిలో పెట్టుకున్న కన్నడ ప్రజలు ఆయన నటించిన ‘బాహుబలి2’ సినిమా విడుదలను బ్యాన్ చేయాలంటూ రచ్చ చేస్తున్నారు. ఇప్పటివరకు ఈ విషయంపై స్పందించని రాజమౌళి ఇక రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో రంగంలోకి దిగారు. తాము ఎంతో వ్యయప్రయాసలతో తెరకెక్కించిన బాహుబలి2 సినిమాను అడ్డుకోవద్దంటూ కన్నడ ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ.. కన్నడలో ఓ స్పీచ్ ను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ వీడియోలో రాజమౌళి మాట్లాడుతూ..

ఎప్పుడో తొమ్మిదేళ్ల క్రితం సత్యరాజ్ చేసిన వ్యాఖ్యలను పట్టుకొని ఇప్పుడు బాహుబలి2 సినిమాను విడుదల కానివ్వమనడం సరికాదు. ఈ సినిమాలో నటించిన ఎందరో నటీనటుల్లో ఆయన కూడా ఒకరు అంతేకానీ ఈ సినిమాను దర్శకుడు, నిర్మాత ఆయన కాదు. ఈ తొమ్మిదేళ్లలో ఆయన నటించిన చాలా సినిమాలు కన్నడలో విడుదలయ్యాయి. బాహుబలి1 కూడా విడుదలైంది. ఆ సినిమాను ఆదరించినట్లుగానే ఈ సినిమాను కూడా ఆదరిస్తారని నమ్ముతున్నాను. దయచేసి ఆయన ఒక్కరు చేసిన కామెంట్స్ ను దృష్టిలో పెట్టుకొని ఎందరో కష్టాన్ని శిక్షించడం సరికాదని వెల్లడించారు.