HomeTelugu Big StoriesOscars 2024: వేదికపై మరోసారి మెరిసిన ఆర్‌ఆర్‌ఆర్‌.. ఆనందంలో ఫ్యాన్స్‌

Oscars 2024: వేదికపై మరోసారి మెరిసిన ఆర్‌ఆర్‌ఆర్‌.. ఆనందంలో ఫ్యాన్స్‌

Untitled 1

Oscars 2024: ఆస్కార్‌ వేదికపై ‘ఆర్ఆర్ఆర్’ మూవీ మరోసారి మెరిసింది. రాజమౌళి డైరెక్షన్ లో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ నటించిన ఈ మూవీలోని స్టంట్స్ వీడియో ఒకటి వేదికపై ప్లే చేశారు. గతేడాది హాలీవుడ్ లో జరిగిన ప్రతి ప్రతిష్టాత్మక అవార్డుల వేడుకలో ఆర్ఆర్ఆర్ సందడి కనిపించింది. గోల్డెన్ గ్లోబ్స్, క్రిటిక్స్ ఛాయిస్ అవార్డులు, ఆస్కార్స్ లో ఈ మూవీ అవార్డులు గెలుచుకుంది.

గతేడాది ఆస్కార్‌ వేదికపై నాటు నాటు లైవ్ పర్ఫార్మెన్స్ కూడా చేయడం విశేషం. సినిమాలో ఈ పాట పాడిన కాల భైరవ, రాహుల్ సిప్లిగంజ్ ఆస్కార్స్ స్టేజ్ పై లైవ్ ఇచ్చారు. బాలీవుడ్ నటి దీపికా పదుకోన్ ఈ లైవ్ పర్ఫార్మెన్స్ ప్రజెంటర్ గా పాట పై ప్రశంసలు కూడా చేశారు.

తాజాగా 96వ అకాడెమీ అవార్డుల వేదికపై ఈ సినిమాకు సంబంధించిన ఓ స్టంట్స్ వీడియోను ప్లే చేయడం అభిమానులను థ్రిల్ కు గురి చేసింది. ఈసారి ఆస్కార్‌ వేడుకల్లో కూడా ఓ వీడియోలో సడెన్ ఈ మూవీలోని సీన్స్ కనిపించడంతో అభిమానులకు ఆశ్చర్యానికి గురయ్యారు. ఆర్ఆర్ఆర్ సినిమాలో తారక్, చరణ్ కలిసి చేసిన స్టంట్స్ వీడియోను ఆస్కార్స్ వేదికపై ప్లే చేశారు.

అమెరికాలోని లాస్ ఏంజిల్స్ లో ఉన్న డాల్బీ థియేటర్ లో ఆస్కార్స్ 2024 వేడుక జరిగింది. ఇందులో ఆస్కార్స్ కు నామినేట్ అయిన నటీనటులు రియాన్ గోస్లింగ్, ఎమిలీ బ్లంట్.. ప్రపంచవ్యాప్తంగా సినిమాల్లో పని చేసే స్టంట్ కోఆర్డినేటర్ల కృషిని గుర్తు చేసుకుంటూ ఓ వీడియో ప్లే చేశారు. ఇందులో ఎన్నో హాలీవుడ్ సినిమాలతోపాటు మనఆర్ఆర్ఆర్ మూవీలోని స్టంట్స్ కూడా ఉన్నాయి.

క్లైమ్యాక్స్ ఫైట్ లో రామ్ చరణ్ ను తన భుజాలపైకి ఎక్కించుకొని తారక్ చేసే ఫైట్, ఆ తర్వాత మంటల్లో నుంచి ఈ ఇద్దరూ బయటకు దూసుకొచ్చే సీన్ ఈ స్టంట్స్ కూడా ఈ వీడియోలో ఉన్నాయి. ఇది చూసి ఫ్యాన్స్ థ్రిల్అయ్యారు. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో షేర్‌ చేస్తూ..తమ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu