HomeTelugu Big Stories'ఆర్‌ఆర్‌ఆర్‌'లో అమితాబ్‌బచ్చన్‌‌, మహేష్‌ బాబు?

‘ఆర్‌ఆర్‌ఆర్‌’లో అమితాబ్‌బచ్చన్‌‌, మహేష్‌ బాబు?

7 2

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రం కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో టాలీవుడ్‌ స్టార్‌ హీరోలు మెగా పవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌, యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రంలో అల్లూరి సీతారామరాజుగా రామ్‌చరణ్‌, కొమరం భీంగా ఎన్టీఆర్‌ కనిపించనున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మరో ఆసక్తికర వార్త టాలీవుడ్‌లో చక్కర్లు కొడుతోంది. అదేమిటంటే.. మహేశ్‌బాబు, అమితాబ్‌బచ్చన్‌ ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ బృందంలో చేరుతున్నారట. కాకపోతే వాళ్లు కనిపించరు.. వినిపిస్తారంతే. టాలీవుడ్‌లో వినిపిస్తున్న వార్తల ప్రకారం.. ‘ఆర్ఆర్‌ఆర్‌’ సినిమా తెలుగు వెర్షన్‌కు మహేశ్ బాబు‌, హిందీ వెర్షన్‌కు అమితాబ్‌ వాయిస్‌ ఓవర్‌ ఇవ్వనున్నారట. ఈ మేరకు రాజమౌళి.. అమితాబ్‌, మహేశ్‌తో సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ తమిళం, మలయాళ వెర్షన్లకు ఏ హీరోలతో వాయిస్‌ ఓవర్‌ ఇప్పించాలనే విషయంలో రాజమౌళి ఇంకా నిర్ణయానికి రాలేదట. దీనిపై ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu