రవితేజకు నో చెప్పిందట!

ప్రస్తుతం మాస్ మహారాజ్ రవితేజ టచ్ చేసి చూడు సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే పనిలో బిజీగా ఉన్నాడు.  ఈ సినిమా తర్వాత కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నాడు. సోగ్గాడే చిన్ని నాయనా, రారండోయ్ వేడుక చూద్దాం తో హిట్స్ అందుకున్న కళ్యాణ్ కృష్ణ….వైవిధ్యభరితమైన ఓ కథను రవితేజకు వినిపించి ఓకే చేయించాడని తెలుస్తుంది.

దాంతో త్వరలో సెట్స్ పైకి వెళ్ళడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా రకుల్ ని తీసుకోవాలని మొదట దర్శకుడు భావించాడట. అయితే ఆమెని ఈ విషయంలో సంప్రదించగా పెద్దగా ఆసక్తి చూపలేదట. గతంలో రవితేజతో చేసిన కిక్ 2 సక్సెస్ కాకపోవడమే అందుకు కారణం అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. రకుల్ ఆసక్తి చూపించకపోవడంతో రవితేజ సరసన తమన్నాని తీసుకోవాలని ప్రయత్నిస్తున్నారట.