HomeTelugu Newsరాజమౌళి నెక్స్ట్ మూవీ ఈ హీరోతోనేనా!

రాజమౌళి నెక్స్ట్ మూవీ ఈ హీరోతోనేనా!

12 15
దర్శకధీరుడు రాజమౌళి ప్రస్తుతం ‘ఆర్ ఆర్ ఆర్’ సినిమాతో బీజీగా ఉన్నాడు. టాలీవుడ్‌ స్టార్‌ హీరోలు యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్ .. మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్ ప్రధాన పాత్రలను పోషిస్తున్న ఈ సినిమా, ఇప్పటికే చాలా వరకూ చిత్రీకరణను జరుపుకుంది. భారీ బడ్జెట్ తో నిర్మితమవుతున్న ఈ సినిమాను, ప్రపంచవ్యాప్తంగా వివిధ భాషల్లో విడుదల చేయనున్నారు.

ఈ నేపథ్యంలో ఆయన తదుపరి సినిమా ఏ హీరోతో చేయబోతున్నాడు అనే ఆసక్తి ప్రేక్షకుల్లో మొదలైంది. రాజమౌళి తన తదుపరి మూవీ మీడియం బడ్జెట్ లోనే రూపొందుతుందనీ, హీరోగా రానా లేదా రామ్ గాని అయి ఉండొచ్చనే .. వార్తలు ఫిల్మ్ నగర్లో వినిపిస్తోన్నాయి. ఇప్పటికే ఈ సినిమాకి విజయేంద్ర ప్రసాద్ కథను కూడా సిద్ధం చేయడం జరిగిపోయిందని అంటున్నారు. ఇది ఎంత వరుకు నిజమో తెలియాల్సి ఉంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu