తనూశ్రీ దత్తా -రాఖీ సావంత్ మధ్య మాటల యుద్ధం

నటి తనుశ్రీ దత్తాపై ఐటమ్‌ బాంబ్‌ రాఖీ సావంత్ తీవ్ర ఆరోపణలు చేసింది. తనుశ్రీకి డ్రగ్స్ తీసుకునే అలవాటు ఉందని, గతంలో రేవ్ పార్టీలకు తీసుకెళ్లి పలుమార్లు తనపై అత్యాచారానికి పాల్పడిందని రాఖీ ఆరోపించింది. పదేళ్ల పాటు కోమాలో ఉండి బయటకొచ్చిన తనుశ్రీకి పిచ్చి పట్టిందని తీవ్రంగా మండిపడింది. బాలీవుడ్ ప్రముఖ నటుడు నానా పటేకర్‌పై తనుశ్రీ దత్తా లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. తనుశ్రీ కొన్నేళ్లు అమెరికాకు వెళ్లి భారత్‌కు తిరిగొచ్చిందని, ఆమె చేతిలో సినిమాలు లేవని.. తన దగ్గర డబ్బు లేక నానా పటేకర్‌ను లైంగిక వేధింపుల ఉచ్చులోకి లాంగిందని ఆరోపించింది. తనుశ్రీ లెస్బియన్ అని ఆమెతో రేవ్ పార్టీలకు వెళ్లినప్పుడు పదేళ్ల క్రితం తనపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడిందని రాఖీ సావంత్ ఆరోపించింది.

అయితే రాఖీ సావంత్ ఆరోపణలపై స్పందించిన తనుశ్రీ దత్తా తాను లెస్బియన్‌ కాదని వివరణ ఇచ్చింది. రాఖీ సావంత్ ఆరోపణలకు భయపడేరకం కాదని, తాను ఉద్దేశపూర్వకంగానే ఆరోపణలు చేస్తోందని మండిపడింది. తనకు డ్రగ్స్‌, డ్రింక్ తీసుకోవడం అలవాటు లేదని వివరణ ఇచ్చింది. కనీసం స్మోకింగ్‌ కూడా చేయనని, రాఖీసావంత్ రేవ్ పార్టీలకు తీసుకెళ్లి డ్రగ్స్ అలవాటు చేయించడం నీతిమాలిన చర్య అంటూ మండిపడింది.