HomeTelugu Trendingసూపర్‌ స్టార్‌ 169వ చిత్రం 'జైలర్‌'

సూపర్‌ స్టార్‌ 169వ చిత్రం ‘జైలర్‌’

Rajinikanth 169 movie jaile
సూపర్‌ స్టార్‌ రజనికాంత్‌ 169వ సినిమా.. బీస్ట్‌ ఫేమ్‌ నెల్సన్‌ డైరెక్షన్‌ లో చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి ‘జైలర్‌’ అనే టైటిల్‌ను ఫిక్స్‌ చేశారు. ఈ మేరకు టైటిల్‌ పోస్టర్‌ను విడుదల చేశారు మేకర్స్‌. కత్తికి రక్తపు మరకలతో పోస్టర్‌ రూపొందించారు. జైలు నేపథ్యంలో రూపొందే ఈ మూవీని ప్రతిష్టాత్మక బ్యానర్‌ సన్‌ పిక్చర్స్‌పై కళానిధి మారన్‌ నిర్మిస్తున్నండగా.. అనిరుధ్‌ రవిచందర్‌ సంగీతం అందిస్తున్నాడు.

ఇక ఈ సినిమాలో రజనీకి జోడిగా మాజీ విశ్వసుందరి ఐశ్వర్య రాయ్‌ నటించనున్నట్టు తెలుస్తోంది. అలాగే మరో హీరోయిన్‌గా నటి ప్రియాంక కనిపించనుండగా.. రమ్యకృష్ణ, డైరెక్టర్‌ కేఎస్‌ రవికూమార్‌, కన్నడ స్టార్ నటుడు శివరాజ్‌ కుమార్‌, హీరో శివకార్తికేయన్‌ ప్రధాన పాత్రలు చేయనున్నారని వినికిడి. జులై నుంచి ఈ మూవీ రెగ్యూలర్‌ షూటింగ్‌ ప్రారంభం కానుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu