సమంత ‘ఓ బేబీ’ ట్రైలర్‌

ప్రముఖ నటి సమంత ప్రధాన పాత్రలో నటించిన సినిమా ‘ఓ బేబీ’. ఈ చిత్రానికి నందినీ రెడ్డి దర్శకత్వం వహించారు. ఈ సినిమా ట్రైలర్‌ను చిత్రబృందం గురువారం విడుదల చేసింది. ‘తెల్లవారుజామున నాలుగు గంటలకు సన్నటి వర్షం.. ఉన్నట్టుండి ఆకాశం నుంచి ఓ మెరుపు. ఆ మెరుపు వెలుగులో బేబీ. బేబీ 70 ఏళ్ల ముసల్ది కాదు. 24 ఏళ్ల పడుచు పిల్ల’ అని రాజేంద్ర ప్రసాద్‌.. రావు రమేశ్‌తో చెబుతున్న డైలాగ్‌తో ట్రైలర్ మొదలైంది. ‘దేవుడు మళ్లీ వయసిచ్చాడు. ఆ వయసు మళ్లీ రెక్కలు విప్పుకొంటుంది’ అంటూ సమంత ఏడుస్తూ చెప్పే డైలాగ్‌ హైలైట్‌గా నిలిచింది. ‘మిస్‌ గ్రానీ’ అనే కొరియన్‌ సినిమాకు ‘ఓ బేబీ’ రీమేక్‌గా రాబోతోంది. ఇందులో ఓ వృద్ధురాలికి మళ్లీ యవ్వన వయసు వస్తే ఎలా ఉంటుంది? అన్న కాన్సెప్ట్‌తో సినిమాను తెరకెక్కించారు. సమంత వృద్ధురాలయ్యాక ప్రముఖ నటి లక్ష్మి పాత్రలో కనిపిస్తారు. రాజేంద్రప్రసాద్‌ సమంతకు స్నేహితుడిగా, రావు రమేశ్‌ కుమారుడిగా, మాస్టర్‌ తేజ మనవడిగా కన్పించనున్నారు. నాగశౌర్య కీలక పాత్రను పోషించారు. జులై 5న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.