HomeTelugu Big Storiesసుశాంత్‌ నాకడుపున పుడతాడు..రాఖీ సావంత్ సంచలన వ్యాఖ్యలు

సుశాంత్‌ నాకడుపున పుడతాడు..రాఖీ సావంత్ సంచలన వ్యాఖ్యలు

12a 1

బాలీవుడ్‌ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణంతో యావత్‌ సినీ అభిమానులు షాక్‌ అయ్యారు. 34 ఏళ్ల వయసున్న సుశాంత్ బాంద్రాలోని తన ఇంట్లోనే సూసైడ్ చేసుకున్న వార్తను ఇంకా ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు.. ఈయన మరణవార్త తెలుసుకున్న ఫ్యాన్స్‌, బాలీవుడ్ ప్రముఖులు ఒక్కసారిగా నిర్ఘాంత పోయారు. ఇదిలా ఉంటే సుశాంత్ మరణం తర్వాత బాలీవుడ్‌లో పాతుకుపోయిన నెపోటిజంతో పాటు బయటి వాళ్లను ఎదగనీయకుండా ఎంత స్థాయిలో తొక్కేస్తున్నారనేది మరోసారి బయటపడింది. కరణ్ జోహార్, సల్మాన్ సహా చాలా మందిని ఏకి పారేస్తున్నారు నెటిజన్లు. తాజాగా సల్మాన్ ఖాన్.. ఈ విషయమై తన అభిమానులు.. సుశాంత్ అభిమానులకు తోడుగా ఉండాలని పిలుపు నిచ్చాడు.

సుశాంత్ సింగ్ ఆత్మహత్యపై ప్రముఖ హీరోయిన్ రాఖీ సావంత్ స్పందించింది. ఓ వీడియోను కూడా విడుదల చేసింది. సుశాంత్ తనకు కలలో కనిపించినట్టు చెప్పుకొచ్చింది. అంతేకాదు త్వరలోనే సుశాంత్ తనకు బిడ్డగా పుట్టబోతున్నట్టు చెప్పింది. ఇక ఆమె కలలో సుశాంత్ కనిపించి బాలీవుడ్ తనను వెలివేసిందన్న విషయాన్ని చెప్పినట్లు ఈ సందర్భంగా వెల్లడించింది. ఇంకా పూర్తి కాని తన సినిమాల్లో ఐటెం సాంగ్స్ ఉంటే చేయాలని కోరినట్టు తాజాగా విడుదల చేసిన వీడియోలో తెలిపింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu