దగ్గరికి రావద్దు.. అక్కడి నుంచే సెల్ఫీ దిగు.. అభిమానికి నచ్చజెప్పిన కత్రినా

తాజాగా బాలీవుడ్‌ నటి కత్రినా కైఫ్‌కు ముంబయి ఎయిర్‌పోర్ట్‌లో చేదు అనుభవం ఎదురైంది. ఆమె బాడీగార్డ్స్‌తో కలిసి ఎయిర్‌పోర్ట్‌ నుంచి బయటికి వస్తున్నప్పుడు ఓ అభిమాని సెల్ఫీ తీసుకోవడానికి అత్యుత్సాహం ప్రదర్శించాడు. కత్రినాకు మరీ దగ్గరగా వెళ్లేందుకు ప్రయత్నించడంతో బాడీగార్డ్స్‌ అతన్ని వెనక్కి లాగిపడేశారు. దాంతో అతను మళ్లీ కత్రినా వద్దకు వచ్చి ‘మేడమ్‌.. ఒక్క సెల్ఫీ’ అని రిక్వెస్ట్‌ చేశాడు. ఇందుకు కత్రినా.. ‘నిదానంగా.. దగ్గరికి రావద్దు. అక్కడి నుంచే సెల్ఫీ దిగు’ అని చెప్పారు. ఆ సమయంలో అక్కడే ఉన్న మీడియా వర్గాలు ఆ దృశ్యాన్ని వీడియో తీసి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశాయి.