పీటర్ హెయిన్స్ మెగాఫోన్ పట్టుకోబోతున్నాడు!

కొరియోగ్రాఫర్స్ దర్శకులుగా మారడం గమనిస్తూనే ఉన్నాం. ప్రభుదేవా, లారెన్స్ వంటి డాన్స్ మాస్టర్స్ దర్శకులుగా రాణించారు. అయితే ఫైట్ మాస్టర్స్ డైరెక్టర్స్ గా మారడం చాలా అరుదుగా జరుగుతుంటుంది. ఇప్పుడు పీటర్ హెయిన్స్ ఆ రేర్ ఫీట్ ను చేయబోతున్నాడు. సౌత్ ఇండియాలో మోస్ట్ వాంటెడ్ ఫైట్ మాస్టర్ పీటర్ హీయిన్స్. రోబో, బాహుబలి1 వంటి చిత్రాలకు ఆయన ఫైట్స్ అందించారు. అయితే ఎప్పటినుండో సినిమాకు దర్శకత్వం వహించాలనేది పీటర్ కల. ఇప్పుడు ఆ కలను సాకారం చేసుకునే దిశగా ఆయన పయనిస్తున్నాడు. 
మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ కు ఓ కథ చెప్పి ఓకే చేయించుకున్నాడట పీటర్. త్వరలోనే ఈ కాంబినేషన్ సెట్స్ పైకి వెళ్లనుందని తెలుస్తోంది. మోహన్ లాల్ నటించిన ‘మన్యం పులి’ సినిమాకు పీటర్ హెయిన్స్ ఫైట్స్ కంపోజ్ చేశారు. ముఖ్యంగా పులితో మోహన్ లాల్ చేసే పోరాట సన్నివేశాలు సినిమాకు హైలైట్ గా నిలిచాయి. ఆ సినిమా సమయంలోనే పీటర్, మోహన్ లాల్ కు కథ వినిపించాడట. కథ నచ్చడంతో మోహన్ లాల్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఫైట్ మాస్టర్ కదా.. పూర్తిస్థాయి యాక్షన్ సినిమా అనుకోకండి.. ఎందుకంటే ఈ సినిమా అసలు ఫైట్స్ ఉండవట. సరికొత్త నేపధ్యంలో సాగే ఓ ఫీల్ గుడ్ ఎంటర్టైనర్ అని తెలుస్తోంది.