HomeTelugu Newsవకీల్‌ సాబ్‌లో నటించడం లేదు: శృతిహాసన్‌

వకీల్‌ సాబ్‌లో నటించడం లేదు: శృతిహాసన్‌

11 9
పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ నటిస్తున్న తాజా చిత్రం ‘వకీల్‌ సాబ్‌’. బాలీవుడ్‌లో అమితాబ్‌ బచ్చన్‌ ప్రధాన పాత్రలో నటించిన ‘పింక్‌’ చిత్రానికి రీమేక్‌గా తెలుగులో ‘వకీల్‌ సాబ్’గా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. వేణు శ్రీరామ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో పవన్‌కల్యాణ్‌ సతీమణిగా శృతిహాసన్‌ కనిపించనున్నారంటూ గత కొన్నిరోజులగా వార్తలు వచ్చాయి. దీంతో అభిమానులు ‘గబ్బర్‌సింగ్‌’ జంటను మరోసారి వెండితెరపై చూడనున్నామంటూ సంతోషం వ్యక్తం చేశారు. ఈ విషయంపై ఓ ఆంగ్ల పత్రికవారు శృతిహాసన్‌ను సంప్రదించగా.. తాను ‘వకీల్‌ సాబ్‌’ చిత్రంలో నటించడం లేదని స్పష్టం చేసింది శృతి. అది ఒక ఫేక్‌ న్యూస్‌. ఆ వార్తలు నిజమని చెప్పడానికి ఎలాంటి ఆధారాలు లేవు. అవన్నీ రూమర్స్‌ మాత్రమే కాబట్టి నేను దాని గురించి మాట్లాడాలనుకోవడం లేదు.’ అనిశృతిహాసన్‌ స్పష్టత ఇచ్చారు. దీంతో అభిమానులు కొంతవరకూ నిరాశ వ్యక్తం చేస్తున్నారు.

దాదాపు మూడేళ్ల తర్వాత శృతిహాసన్‌ తెలుగులోకి రీఎంట్రీ ఇస్తున్న చిత్రం ‘క్రాక్‌’. రవితేజ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి గోపీచంద్‌ మలినేని దర్శకత్వం వహస్తున్నారు. మరోవైపు ‘వకీల్‌ సాబ్‌’ చిత్రాన్ని వేసవి కానుకగా మే నెలలో విడుదల చేయాలని చిత్రబృందం భావించిందిట.

Recent Articles English

Gallery

Recent Articles Telugu