HomeTelugu Trendingతమ్ముడితో రకుల్‌ పులుసాట.. వీడియో వైరల్‌

తమ్ముడితో రకుల్‌ పులుసాట.. వీడియో వైరల్‌

3 2
కరోనా కారణరంగా దేశవ్యాప్తంగా లాక్‌‌డౌన్‌ కొనసాగుతుంది. దానితో ఇంటికే పరిమితమైన అందాల నటి రకుల్ ప్రీత్ సింగ్, తనకు దొరికిన ఖాళీ సమయాన్ని కుటుంబంతో కలిసి సరదాగా గడుపుతూ ఉంది. తాజాగా, తన తమ్ముడు అమన్ తో కలిసి, చిన్నప్పుడు ఆడిన ఆటలను ఆడుకుంటూ, అందుకు సంబంధించిన వీడియో తీసి, తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసింది.

కాగా ఈ అమ్మడు సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటూ.. ఎప్పటికప్పుడు యెగా, ఫన్నీ మీడియోలను పోస్ట్ చేస్తూ ఉంటుంది. తాజాగా, పలు రకాల ఆటలను ఆడుతున్న వీడియోను పెట్టగా, అదిప్పుడు వైరల్ అవుతోంది. అమన్ తో కలిసి ‘దిండూ – దెబ్బ’, ‘కబడ్డీ’, ‘పులుసు’ ఆటలు ఆడింది. ఇక ఈ ఆటలను చిన్నప్పుడు ఆడుకున్నానని, ఇప్పుడు వాటన్నింటినీ గుర్తు చేసుకున్నానని, ఇటువంటి సమయం ఎవరినైనా బాల్యంలోకి తీసుకెళ్తుందని వ్యాఖ్యానించింది. ఎంతో ఆకట్టుకుంటున్న ఈ వీడియోను మీరూ చూడవచ్చు.
https://www.instagram.com/tv/B_rVVBhh9FD/?utm_source=ig_web_copy_link

Recent Articles English

Gallery

Recent Articles Telugu