HomeTelugu Trendingఅనసూయ ప్రధాన పాత్రలో 'అరి'

అనసూయ ప్రధాన పాత్రలో ‘అరి’

Anasya Ari movie
యాంకర్‌, నటి అనసూయ ప్రధాన పాత్రలో ఓ సినిమా రూపొందిస్తున్నారు. ఇందులో సాయికుమార్, శుభలేఖ సుధాకర్, వైవా హర్ష ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు అరి టైటిల్ ఖరారు చేశారు. ఈ చిత్రం టైటిల్ లోగోను విడుదల చేశారు. పేపర్ బాయ్ దర్శకుడు జయశంకర్‌ రూపొందిస్తున్న రెండో చిత్రమిది. శేషు మారం రెడ్డి, శ్రీనివాస్ రామిరెడ్డి నిర్మిస్తున్నారు.

ఈ సందర్భంగా దర్శకుడు జయశంకర్ మాట్లాడుతూ ‘అరి’ అనేది సంస్కృత పదం. శత్రువు అని అర్థం. అది ఎవరు? ఈ టైటిల్‌ ఎందుకు పెట్టామో సినిమా చూస్తే తెలుస్తుంది. శత్రువు ఎవరు అనేది సినిమాలో చెప్పాను. కరోనా సమయంలో ఎన్నో కష్టాల కోర్చి ఈ సినిమా పూర్తిచేశాం. అనూప్‌రూబెన్స్‌ మంచి ట్యూన్స్‌ ఇచ్చారు అని అన్నారు.

కథ చెప్పినప్పుడే చాలా ఆసక్తిగా అనిపించింది. ఈ చిత్రంలో మానవీయ అంశాలతో పాటు వినోదం కూడా ఉంటుంది. మనుషులు ఎలా బతకకూడదనే అంశాన్ని వినోదాత్మకంగా చూపించారు అని అనసూయ అన్నారు. నిజాయితీగా పని చేస్తే సినిమా రంగంలో సక్సెస్‌ వస్తుంది.. రావడం ఆలస్యమైనా రావడం మాత్రం పక్కా అన్నారు నిర్మాత మిర్యాల రవీందర్‌ రెడ్డి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu