HomeTelugu NewsRakul Preet Singh: రకుల్‌ బ్యాచిలర్‌ పార్టీలో.. టాలీవుడ్‌ హీరోయిన్స్‌ సందడి

Rakul Preet Singh: రకుల్‌ బ్యాచిలర్‌ పార్టీలో.. టాలీవుడ్‌ హీరోయిన్స్‌ సందడి

Rakul preet singh bachelor

Rakul Preet Singh: హీరోయిన్‌ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ గురించి ప్రత్యేకించి చెప్పానవసరం లేదు. టాలీవుడ్‌లో పలువురు స్టార్‌ హీరోలతో నటించిన ఈ బ్యూటీకి ఇక్కడ అవకాశలు తగ్గడంతో బాలీవుడ్‌పై పూర్తిగా ఫొకస్‌ పెట్టింది. సోషల్ మీడియాలో ఈ అమ్మడుకి మంచి ఫాలోయింగ్‌ ఉంది.

కాగా త్వ‌ర‌లో రకుల్‌ పెళ్లి పీట‌లు ఎక్క‌నున్న విష‌యం తెలిసిందే. బాలీవుడ్ న‌టుడు జాకీ భగ్నానీతో ర‌కుల్ ఈ నెల 21న గోవాలో పెళ్లి చేసుకోబోతుంది. ఈ క్ర‌మంలో ర‌కుల్ ప్రీత్‌ సింగ్ త‌న స్నేహితుల‌కు బ్యాచిలర్ పార్టీ ఇచ్చింది.

థాయ్ లాండ్ వేడుక‌గా ఈ బ్యాచిల‌ర్ పార్టీ జరిగింది. ఈ పార్టీకి టాలీవుడ్ హీరోయిన్స్ ప్రగ్యా జైస్వాల్, సీర‌త్ క‌పూర్, మంచు లక్ష్మి త‌దిత‌రులు హాజ‌ర‌య్యారు. వీళ్లు ముగ్గురు ఎప్పటి నుండో ఫ్రెండ్స్‌ కావడంతో దీంతో ఈ బ్యాచ్‌లర్‌ పార్టీలో వీరు సందడి చేశారు.

కాగా ప్ర‌స్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు సోష‌ల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఫిబ్రవరి 21న గోవాలోని ఓ రిసార్ట్‌లో కుటుంబసభ్యులు, స్నేహితులు, సన్నిహితుల సమక్షంలో ర‌కుల్ పెళ్లి గ్రాండ్‌గా జ‌రుగ‌నుంది.

 

Recent Articles English

Gallery

Recent Articles Telugu