అక్షయ్‌ కుమార్‌కు జంటగా రకుల్‌!

రకుల్ ప్రీత్‌ సింగ్‌ టాలీవుడ్‌, బాలీవుడ్‌ల్లో సినిమాలు చేస్తుంది. అయితే బాలీవుడ్‌పై ఎక్కువ దృష్టి పెట్టడంతో తెలుగులో ఆమెకి సినిమాలు తగ్గిపోయాయి అనే చెప్పాలి. ఇక తమిళంలో ఆమె పెద్దగా దృష్టి పెట్టలేదు గనుక, ఆ విషయాన్ని గురించి మాట్లాడుకోవలసిన అవసరం లేదు. అయితే బాలీవుడ్ లో నిలదొక్కుకోలేకపోతే రకుల్ పని అయిపోయినట్టేనని అంతా అనుకున్నారు. అయితే బాలీవుడ్ లో ఓ మూడు సినిమాలు చేస్తోంది. అంతేకాదు రకుల్‌కి మరో సినిమాలో ఛాన్స్‌ వచ్చినట్లు తెలుస్తోంది. అక్షయ్ కుమార్ జోడీగా నటిస్తుంది. రంజిత్ తివారి ఈ సినిమాకి దర్శకత్వం వహించనున్నాడు.

CLICK HERE!! For the aha Latest Updates