సంచలన రీమేక్‌తో రామ్‌ చరణ్‌

మెగా పవర్‌ స్టార్‌ రామ్ చరణ్ గతేడాది నటించిన రంగస్థలం సినిమా రికార్డులు తిరగరాసింది. సుకుమార్ తెరకెక్కించిన ఈ చిత్రం తెలుగులో ఈ మధ్య కాలంలో ఏ హీరో కనీసం సాహసం కూడా చేయని కథనంతో వచ్చింది. ఇందులో చరణ్ చేసిన చిట్టిబాబు పాత్ర కూడా సంచలనమే. ఈ సినిమాతో నటుడిగా చాలా మెట్లు ఎదిగాడు రామ్ చరణ్. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో RRR సినిమాతో బిజీగా ఉన్నాడు మెగా పవర్ స్టార్.

మరోవైపు తండ్రి సినిమాలు కూడా నిర్మిస్తూ బిజీ అయిపోయాడు. ఇలాంటి తరుణంలో ఈయన మనసు ఓ తమిళ సినిమా వైపు వెళ్తుందని తెలుస్తుంది. త‌మిళంలో ఈ మధ్యే విడుదలైన అసురన్ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచన టాలీవుడ్ నిర్మాతల్లో మొదలైంది. ధ‌నుష్ హీరోగా నటించిన ఈ చిత్రానికి ప్రేక్ష‌కులు, విమ‌ర్శ‌కుల నుంచి ప్ర‌శంస‌ల వర్షం కురుస్తుంది. మహేష్ బాబు ఈ చిత్రం చూసి ధనుష్‌ను ఓ రేంజ్‌లో పొగిడేసాడు.

వెట్రిమారన్ తెరకెక్కించిన ఈ చిత్రాన్ని తెలుగులో రామ్ చరణ్ హీరోగా రీమేక్ చేస్తే బాగుంటుందని కొందరు నిర్మాతలు ప్రయత్నాలు మొదలు పెట్టారు. రంగస్థలం తరహాలోనే పూర్తి స్థాయి రా కంటెంట్‌తో ఈ చిత్రం వచ్చింది. దాంతో ఆ ఎఫెక్ట్ ఉంది కాబట్టి చరణ్ అయితే ఈ రీమేక్‌కు బాగా సూట్ అవుతాడని భావిస్తున్నారు నిర్మాతలు. మళయాల నటి మంజు వారియ‌ర్ ఈ సినిమాలో హీరోయిన్. ఒకవేళ అసురన్ సినిమా కానీ రామ్ చరణ్ హీరోగా రీమేక్ చేస్తే అది నిజంగానే మరో రంగస్థలం కావడం ఖాయం.