ఇది మా అమ్మ కల: చరణ్‌

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ప్రస్తుతం రాజమౌళి డైరెక్షన్‌లో ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా చరణ్ టీజర్ విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకుంది. మరోవైపు చిరంజీవి, కొరటాల కాంబినేషన్‌లో వస్తున్న ‘ఆచార్య’ సినిమాలో ఓ కీలక పాత్ర చేస్తున్నాడు. ఇటీవల రామ్ చరణ్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ .. “నాన్నతో కలిసి నేను నటించడం మా అమ్మ కల. ‘ఆచార్య ‘సినిమాతో ఆ కల నెరవేరబోతోంది. ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటిస్తున్నా. నేను నటించిన ‘బ్రూస్ లీ” సినిమా లో నాన్న గెస్ట్ రోల్లో కనిపించరు. ఇక ఆయన నటించిన 150 సినిమాలో నేను నాన్నతో కలిసి స్టెప్పులు వేసా .. నాన్న వల్లే నాకింత స్టార్ డమ్ వచ్చింది. నాన్నతో కలిసి నటించే అవకాశం వచ్చినపుడు అంతకన్నా ఏం కావలి. ” అని రామ్‌చరణ్ అన్నారు. ఇంతకు ముందు మగధీర బ్రూస్ లీ ఖైదీ నెం.150 సినిమాల్లో ఇద్దరు కొన్ని సెకన్ల పాటు కలిసి కనిపించారు చరణ్‌, చిరంజీవి. కాని ఆచార్య సినిమాలో మాత్రం చరణ్ మరియు చిరుల కాంబో సీన్స్ దాదాపుగా అర్థ గంట పాటు ఉంటాయని అంటున్నారు

CLICK HERE!! For the aha Latest Updates