HomeTelugu Big Storiesఅమెరికన్‌ టెలివిజన్‌ షోలో రామ్‌చరణ్‌!

అమెరికన్‌ టెలివిజన్‌ షోలో రామ్‌చరణ్‌!

ram charan in good morning

మెగా పవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ యూఎస్‌కు వెళ్తున్నపుడు ఎయిర్‌పోర్టులో కనిపించిన ఫొటోలు వైరల్‌ అవుతున్నాయి. ఫిబ్రవరి 24న యూఎస్‌లో జరుగబోయే ఆరవ వార్షిక హెచ్‌సీఏ ఫిల్మ్‌ అవార్డ్స్ ఈవెంట్‌కు రామ్‌ చరణ్‌ హాజరు కానున్నాడు. ఇదిలా ఉంటే తాజాగా రాంచరణ్‌కు సంబంధించిన మరో ఆసక్తికర వార్త నెట్టింట చక్కర్లు కొడుతుంది. అమెరికా పాపులర్‌ టెలివిజన్‌ షో గుడ్‌ మార్నింగ్‌ అమెరికా లో మెరువబోతున్నాడు రాంచరణ్‌.

ప్రపంచంలోని అత్యంత ప్రజాదరణ పొందిన టీవీ షోలలో ఒకటి గుడ్‌ మార్నింగ్‌ అమెరికా. ఈ షోలో పాల్గొన్న తొలి భారతీయ నటుడు రామ్‌ చరణ్‌ కావడం విశేషం. ఈ షోలో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమాకు సంబంధించిన విశేషాలతోపాటు అప్‌కమింగ్ ప్రాజెక్ట్‌ల గురించి చర్చించనున్నాడు రామ్‌చరణ్‌. భారత కాలమానం ప్రకారం ఏబీసీ ఛానల్‌లో ఇవాళ రాత్రి 11:30 గంటలకు ఈ షో ప్రసారం కానుంది.

రామ్‌చరణ్‌ హెచ్‌సీఏ ఫిల్మ్‌ అవార్డ్స్‌-2023కు వన్‌ ఆఫ్‌ ది ప్రెజెంటర్‌గా వ్యవహరించనున్నాడు. అమెరికన్‌ యాక్టర్లు బ్రండోన్‌ పెరెరా, డేవిడ్‌ డస్ట్‌మాల్చియాన్‌, మేడ్‌లిన్‌ క్లైన్‌, ట్రినిటీ జో-లీ బ్లిస్‌, వయోలెట్ ఎంసీగ్రాతో కలిసి పాపులర్‌ హెచ్‌సీఏ ఫిల్మ్‌ అవార్డ్సులో మెరువబోతున్నాడు రాంచరణ్‌. ఆర్‌ఆర్‌ఆర్‌ హెచ్‌సీఏ ఫిల్మ్‌ అవార్డ్స్‌-2023 ఫైనల్‌ నామినేషన్స్‌ లో ఉత్తమ యాక్షన్‌ సినిమా, ఉత్తమ అంతర్జాతీయ చిత్రం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ చిత్రం విభాగాల్లో చోటు సంపాదించుకున్న విషయం తెలిసిందే.

హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు

శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు

సమంత ప్రత్యేక పూజలు.. ఎందుకంటే

Follow Us on FACEBOOK   TWITTER

Recent Articles English

Gallery

Recent Articles Telugu