రామ్, అనిల్ రావిపూడిల సినిమాకు బ్రేక్!

రామ్ హీరోగా అనిల్ రావిపూడి ఓ సినిమా చేయాలనుకున్నాడు. దిల్ రాజు నిర్మాతగా ఈ చిత్రాన్ని
నిర్మించాలని భావించారు. అనిల్ చెప్పిన లైన్ నచ్చడంతో రామ్ కూడా ఈ సినిమాకు గ్రీన్
సిగ్నల్ ఇచ్చేశాడు. కానీ ఇప్పుడు ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళే అవకాశాలు కనిపించడం లేదు.
రామ్ ప్రస్తుతం హైపర్ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా దసరా కానుకగా రిలీజ్ కానుంది.
దీని తరువాత అనిల్ రావిపూడి సినిమా చేయాల్సివుంది. కానీ రామ్ ఆ సినిమా కోసం రెమ్యూనరేషన్
ఎక్కువ అడిగినట్లు తెలుస్తోంది. రామ్ మార్కెట్ దృష్ట్యా అంత రెమ్యూనరేషన్ ఇస్తే.. నిర్మాతగా
తనకు వర్కవుట్ కాదని నిరాకరించాడు దిల్ రాజు. దీంతో ఈ ప్రాజెక్ట్ ను పక్కన పెట్టేసి రామ్,
కరుణాకరన్ దర్శకత్వంలో సినిమా చేయడానికి సిద్ధపడినట్లు తెలుస్తోంది.

CLICK HERE!! For the aha Latest Updates