HomeTelugu Trending‘విక్రమ్ వేద’ రీమేక్‌లో... రామ్‌ చరణ్‌

‘విక్రమ్ వేద’ రీమేక్‌లో… రామ్‌ చరణ్‌

3 10

విజయ్ సేతుపతి -మాధవన్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘విక్రమ్ వేద’. తమిళంలో 2017లో విడుదలై విజయవంతమైన చిత్రాలలో ఇది ఒకటి. పుష్కర్ – గాయత్రి దర్శకత్వం వహించిన ఈ సినిమాను తెలుగులో గీతా ఆర్ట్స్ వారు రీమేక్ చేయాలనుకున్నారు. ప్రధాన పాత్రధారులుగా రానా – రవితేజ పేర్లు వినిపించాయి.

అయితే కొన్ని కారణాల వలన ఆ ప్రాజెక్టు పట్టాలెక్కలేదు. మళ్లీ ఇప్పుడు అల్లు అరవింద్ ఈ ప్రాజెక్టు గురించిన ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది. తమిళంలో మాధవన్ చేసిన పాత్రను చరణ్ తో చేయిస్తే బాగుంటుందని ఆయన భావిస్తున్నట్టు చెబుతున్నారు. మరో పాత్రను రవితేజతో చేయిస్తారా? లేదా.. రానాను తీసుకుంటారా? అనే విషయంలో తెలియాల్సి వుంది. 2022లో ఈ ప్రాజెక్టు పట్టాలపైకి వెళుతుందని సమాచారం.

Recent Articles English

Gallery

Recent Articles Telugu