HomeTelugu Trendingప్రాజెక్టు-కె మూవీలో కమల్ పాత్రపై ఆసక్తి

ప్రాజెక్టు-కె మూవీలో కమల్ పాత్రపై ఆసక్తి

Project K movie update

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్-నాగ్ అశ్విన్ సినిమా ‘ప్రాజెక్టు-కే’ కు సంబంధించి రోజుకో ఓ ఆసక్తికర వార్త నెట్టింట సందడి చేస్తోంది. ‘ప్రాజెక్టు-కె’లో కమల్ విలన్‌గా చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం దీనిపైనే సినీ జనాల్లో చర్చ జరుగుతోంది. ఈ సినిమాలో విలన్ గా చేయడానికి కమల్ పారితోషికం ఎంత తీసుకుంటున్నారు.. ఆయన పాత్రను ఎలా డిజైన్ చేశారో.. విలన్‌గా ఆయన ఎంట్రీ ఎలా ఉంటుందో అనేది ఆసక్తికరమైన అంశం.

ఈ సినిమాలో కమల్ హాసన్ ఎంట్రీ ఈ సినిమా క్లైమాక్స్‌లో ఉంటుందని తెలుస్తోంది. ప్రభాస్, శ్రుతిహాసన్ జంటగా నటిస్తున్న ఈ సినిమా, మొదటి నుంచి చివరి వరకూ ఉత్కంఠభరితంగా సాగుతుందని ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాను రెండు భాగాలుగా తెరకెక్కించబోతున్నారట.

భారీ బడ్జెట్ తో సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఈ మూవీని 5 భాషల్లో విడుదల చేయబోతున్నారు. ఈ సినిమాలో కమల్ హాసన్‌తోపాటు బాలీవుడ్ నటులు అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనే, దిశా పటానీ కీలకపాత్రల్లో నటిస్తున్నారు.

‘ప్రాజెక్టు K’ మొదటి భాగాన్ని వచ్చే ఏడాది జనవరిలో విడుదల చేయాలని భావిస్తున్నారు. సుమారు రూ.500 కోట్లతో వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ మ్యూజిక్ అందిస్తున్నారు.

అనుష్క ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి’ టీజర్‌

మెగాస్టార్‌ చిరంజీవి భోళాశంకర్‌ టీజర్‌

రామ్‌ గోపాల్‌ వర్మ వివాదస్పద చిత్రం వ్యూహం టీజర్‌

సామజవరగమ మూవీ ట్రైలర్‌

రుద్రంగి మూవీ ట్రైలర్‌

Follow Us on FACEBOOK   TWITTER

Recent Articles English

Gallery

Recent Articles Telugu