HomeTelugu Trendingగేమ్ చేంజర్‌ను గాలికొదిలేశారా.. ఏం చేయలేక చూస్తున్న దిల్ రాజు?

గేమ్ చేంజర్‌ను గాలికొదిలేశారా.. ఏం చేయలేక చూస్తున్న దిల్ రాజు?

Ram Charan Shankar Dil Raju

గేమ్ చేంజర్ సినిమాను ఎప్పుడు ప్రారంభించారు.. ప్రారంభించినప్పుడు ఎలాంటి అంచనాలున్నాయి.. ఇప్పుడు ఎలా ఉన్నాయన్నది అందరికీ తెలిసిందే. ఇండియన్ 2 సినిమా అటకెక్కడం, శంకర్ ఖాళీగా ఉండటం.. కార్తీక్ సుబ్బరాజు కథ రాసుకోవడం.. అది కాస్తా దిల్ రాజు కాంపౌడంలో పడటం.. శంకర్ రామ్ చరణ్ కాంబోని దిల్ రాజు సెట్ చేయడం.. తమ బ్యానర్‌లో యాభైవ చిత్రం అంటూ గ్రాండ్‌గా ప్రకటించడం అందరికీ తెలిసిందే. దాదాపు మూడు నాలుగు వందల కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారని సమాచారం.

అయితే సినిమా అంతకంతకూ ఆలస్యం అవుతుండటంతో ఈ బడ్జెట్ కూడా దాటి పోయి ఉంటుంది. మధ్యలో కమల్ హాసన్ విక్రమ్ బ్లాక్ బస్టర్ అవ్వడంతో మూలన పడ్డ ఇండియన్ 2 మళ్లీ సెట్స్ మీదకు వచ్చింది. దీంతో శంకర్ దృష్టి ఆ సినిమా మీద పడింది. అలా మన గేమ్ చేంజర్‌ను పక్కన పెట్టేశాడు. శంకర్‌కు ఇది సెకండ్ ప్రియార్టీగా మారింది. ఇండియన్ 2 సినిమా షూటింగ్‌ను శంకర్ పూర్తి చేశాడు. కానీ గేమ్ చేంజర్‌ను మాత్రం ఇంకా లాగుతూనే ఉన్నాడు.

అసలు గేమ్ చేంజర్ షూటింగ్ జరుగుతుందా? లేదా? అసలు సినిమా ఉంటుందా? లేదా? అనే అనుమానాలు కూడా పుట్టుకొస్తున్నాయి. అప్డేట్ ఇవ్వండని దిల్ రాజుని అడిగితే.. నా చేతుల్లో ఏం లేదు.. అంతా శంకర్ చూసుకుంటున్నాడని చేతులెత్తేశాడు. జరగండి అనే పాటను ఎప్పుడో రిలీజ్ చేయాల్సింది. ఆ పాట కూడా ఎప్పుడో లీక్ అయింది. అదో నాసిరకం పాట అని అంతా తిప్పి కొట్టేశారు. కానీ ఆ పాటను విజువలైజ్ కూడా చేశారు. కాబట్టి వదలక తప్పని పరిస్థితి.

అయినా ఆ జరగండి పాటకే ఇంకా దిక్కులేదు. ఆ పాటను రిలీజ్ చేస్తారో లేదో ఇంకా తెలియడం లేదు. ఇలాంటి టైంలో గేమ్ చేంజర్ రిలీజ్ డేట్ ఆశించడం కూడా ఎక్కువే అవుతుంది. ఈ మధ్యే గేమ్ చేంజర్‌ను ఆపేశారనే రూమర్లు కూడా వచ్చాయి. అసలు ఈ చిత్రం ఈ ఏడాది అయినా వస్తుందా? లేదా? అన్న క్లారిటీ దిల్ రాజు కాంపౌండ్ నుంచి వస్తుందని అంతా అనుకుంటున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu